Theft in Tirumala Srivari Hundi :తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుమల తిరుపతి (టీటీడీ) విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.
తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ - THEFT IN TIRUMALA SRIVARI HUNDI
తిరుమల శ్రీవారి ఆలయ హుండీలోంచి డబ్బులు కొట్టేసిన దొంగ
theft_in_tirumala_srivari_hundi (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2024, 10:28 AM IST
|Updated : Nov 26, 2024, 11:02 AM IST
Last Updated : Nov 26, 2024, 11:02 AM IST