Juvenile Home Girls Protest at Visakha: విశాఖ వ్యాలీ పాఠశాల సమీపంలోని జువైనల్ హోంలోని బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. జువైనల్ హోంలో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. నిద్ర మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. జువైనల్ హోం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికలను వసతి గృహంలోకి పంపారు.
చర్యలకు ఆదేశించిన హోంమంత్రి: బాలికలు ఆందోళనపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
"ప్రిన్సిపాల్ వేధింపులు" - గురుకుల విద్యార్థుల 18 కి.మీ. పాదయాత్ర