Liquor Thief Remanded in Medak :మద్యం దుకాణంలోకి దొంగతనానికి వెళ్లి అందులోనే నిద్రపోయిన దొంగను బుధవారం రిమాండ్‌కు తరలించారు. నార్సింగి ఎస్సై అహ్మద్ మొహినుద్దీన్ తెలిపిన ప్రకారం నేపాల్‌కు చెందిన రాజాసోద్ నార్సింగిలోని రైస్‌మిల్లులో కూలీగా పని చేసేందుకు తొమ్మిది నెలల కిందట వచ్చాడు. అందులో పని చేస్తూ, వచ్చిన జీతంతో రోజూ మద్యం సేవించేవాడు.
మద్యం దొంగ రిమాండ్ : ఇటీవల మద్యం దుకాణ పరిసరాలను పరిశీలించి కనకదుర్గ వైన్స్‌లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆదివారం రాత్రి దుకాణం పైన ఉన్న రేకులను తొలగించి అందులోకి దూరాడు. అక్కడ మద్యం కనిపించడంతో తాగిన తర్వాతే దొంగతనం చేద్దామనుకున్నాడేమో కానీ విపరీతంగా మద్యం తాగి మత్తులో రాత్రంతా వైన్స్ షాపులోనే నిద్రపోయాడు.