పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ - నగదు, భారీగా ఆభరణాల తస్కరణ - THEFT AT FORMER MINISTER PONNALA
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ - ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు - గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
![పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ - నగదు, భారీగా ఆభరణాల తస్కరణ Theft At Former Minister Ponnala Lakshmaiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-01-2025/1200-675-23343534-thumbnail-16x9-ponnala-theft.jpg)
Theft At Former Minister Ponnala Lakshmaiah (ETV Bharat)
Published : Jan 17, 2025, 3:43 PM IST
Theft At Former Minister Ponnala Lakshmaiah :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై మాజీ మంత్రి దంపతులిద్దరు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షన్నరతో పాటు భారీగా ఆభరణాలు తస్కరణకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో పని మనుషులతో సహా ప్రతి ఒక్కరినీ విచారించి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.