తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ పులి, ఇక్కడ చిరుత - తలలు పట్టుకుంటున్న అటవీశాఖ - THE TIGER KILLED THE BUFFALO

మంచిర్యాల జిల్లాలో ఓ గేదెను హతమార్చిన పెద్దపులి - పులి పాదముద్రలను గుర్తించి దాంపుర్ రేంజ్ అటవీ అధికారులు - పెద్దపులి మాట వింటేనే గజగజ వణుకుతున్న ప్రజలు

FOREST IN MANCHERIAL
TIGER IN MANCHERIAL DISTRICT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 4:27 PM IST

Updated : Feb 21, 2025, 4:50 PM IST

Tiger Killed The Buffalo in Mancherial District : మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని దాంపూర్ గ్రామంలో పెద్దపులి ఓ గేదెను హతమార్చిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. బదాంపూర్, రెడ్డిపల్లి, కాజీపల్లి, అవుడం, కొత్తూరు పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పెద్దపులి అటవీ పాదముద్రలను అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరి నదికి అవతలి వైపు మరో పులి : ప్రజలు రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. పులిని పట్టుకొని సంరక్షణ కేంద్రానికి తరలించడానికి అటవీశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు చెన్నూర్​కు సరిహద్దుల్లోని గోదావరి నదికి అవ తలివైపున ఉండే పలుగుల ప్రాంతంలో మరో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

పశువులపై దాడి చేసిన చిరుత : మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆబ్బాపుర్‌లో చిరుత కలకలం సృష్టించింది. ఉదయం పశువులపై దాడి చేయగా రెండు లేగ దూడలు మృతి చెందాయి. గ్రామ శివారులోని ఇళ్ల సమీపంలోనే ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బోను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి చిరుత తిరిగిన ఆనవాళ్లు గుర్తించారు. పై అధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మల్కాపూర్ గుట్టల్లో పెద్దపులి సంచారం - అక్కడి ప్రజల్లో కలవరం

పెద్దపులి సంచారం - భయంతో స్కూల్​కు సెలవులు

Last Updated : Feb 21, 2025, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details