Grandma sold Her Grandson in Khammam :తమ మనువళ్లను ఎక్కువ ప్రేమ చేస్తుంటారు నానమ్మలు, అమ్మమ్మలు. చిన్న పిల్లల బుడిబుడి నడకలు, తెలిసి తెలియని మాటలు విని సంబరపడుతుంటారు. మనవడు, మనవరాల్లు అంటే వారికి మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటూ వాళ్లతో కాలం గడేపేస్తుంటారు. పిల్లలకు కూడా నానమ్మ, అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది
మనువడిన అమ్మేసిన నానమ్మ :ఖమ్మం జిల్లా నిజాం పేటకు చెందిన ఓ యువ జంట నిండు నూరేళ్లు కలిసి ఉందామని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిఫలంగా ఒక బాబు పుట్టాడు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు బాబు పుట్టిన నెల రోజులకే ఓ రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు. దీంతో బాబును పెట్టుకుని పుట్టింటికి వచ్చిన ఆమె చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. బాబుకు ప్రస్తుతం 21 నెలలు. కొడుకు లేని లోటును మనవడిలో చూసుకుంటానని బాబును దత్తతకు ఇవ్వాలని అత్త కోడలితో చెప్పింది. చిన్న వయస్సు అయినందున వేరే పెళ్లి చేసుకోవచ్చని మాయమాటలు చెప్పింది.