తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అత్యాచారం- వెలుగులోకి ఓ కానిస్టేబుల్ నిర్వాకం - constable traps girl and raped - CONSTABLE TRAPS GIRL AND RAPED

Constable Traps Girl and Raped : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికను ట్రాప్​ చేసిన కానిస్టేబుల్, పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గట్టిగా ప్రశ్నించేసరికి తీరా ముఖం చాటేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Constable Traps Girl and Raped1
CONSTABLE RAPED GIRL in RAJENDRANAGAR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 4:36 PM IST

Updated : Jun 27, 2024, 4:41 PM IST

Constable Traps Girl and Raped : పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలు మాయమాటలు చెబుతూ నాలుగేళ్లుగా మోసం చేస్తూ వచ్చాడు. తీరా పెళ్లి చేసుకోవాలని బాలిక ప్రశ్నించడంతో ముఖం చాటేశాడు. తన దగ్గర ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, వాటిని నెట్​లో పెడతానంటూ బెదిరిస్తూ తన శారీరక వాంఛను తీర్చుకున్నాడు. ఇదంతా చేసింది అల్లరి చిల్లర పోకిరీ కాదు. ప్రజలను రక్షించే ఓ బాధ్యత కలిగిన కానిస్టేబుల్​. జరిగన విషయమంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు.

తల్లిదండ్రులు తిట్టారని ఇంటినుంచి బయటకొచ్చిన మైనర్ - మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన రాపిడో డ్రైవర్ - Girl Raped by Rapido Driver in ts

పూర్తి వివరాల్లోకెళ్తే రాజేంద్రనగర్ ఏసీపీ టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, 2020 బ్యాచ్​కు చెందిన ప్రదీప్​ అనే కానిస్టేబుల్​ మొదటగా పేట్​ బాషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వర్తించినట్లు తెలిపాడు. ప్రస్తుతం రాజేంద్రనగర్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి తమ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

పెళ్లి చేసుకోవాలని సదరు బాలిక గట్టిగా ప్రశ్నించడంతో, ముఖం చాటేసి తనకు సంవత్సరం క్రితమే పెళ్లి జరిగిందని తెలిపాడన్నారు. తన వద్ద ఇరువురు ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, వాటిని నెట్​లో విడుదల చేస్తానని గత కొన్ని రోజులుగా సదరు బాలికను బ్లాక్​ మెయిల్​కు పాల్పడుతున్నట్లు తెలిపాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సదరు కాానిస్టేబుల్​పై డిపార్ట్​మెంటల్​ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

"పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి తమ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2020 బ్యాచ్​కు చెందిన ప్రదీప్​ అనే కానిస్టేబుల్​ ప్రస్తుతం రాజేంద్రనగర్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నాడు. తన వద్ద ఇరువురు ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, బ్లాక్​ మెయిల్​కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశాం". - శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ

పెద్దపల్లి జిల్లాలో దారుణం - మైనర్ బాలికపై హత్యాచారం

చాక్లెట్​ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Last Updated : Jun 27, 2024, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details