Temple Lands Under Encroachment in Nalgonda :ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వేలకు పైగా ఆలయాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన భూములను అనేక మంది భూకబ్జాదారులు(Land Grabbers) ఆక్రమించారు. దేవాలయ భూముల్లో ఏడు వేల ఎకరాలు సాగుకు యోగ్యమైనవి ఉండగా కేవలం 2800 ఎకరాల భూములను మాత్రమే లీజుకిస్తున్నారు. మిగిలిన భూములు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఏటా ఉత్సవాలు జరుపుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో దేవాలయాలు కాలగర్భంలో కలిసే అవకాశం లేకపోలేదు.
Temple land acquisition in Wanaparthy : ప్రభుత్వ భూములు సగం దేవాలయానికి.. మరో సగం స్వాహా
నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్డులో బ్రహ్మంగారి గుడికి చెందిన 12 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. ఆక్రమించడమే కాకుండా వాటిని నివాస స్థలాలుగా మార్చుకొని రిజిస్టర్ చేశారు. రెవెన్యూ, రిజిస్టర్(Revenue, Register ), దేవాదాయశాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డులను మార్చి రిజిస్టర్ చేసుకున్నా, అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో భక్తులు ఫిర్యాదు కూడా చేశారు. భూమిని స్వాధీనం చేసుకొని రికార్డులను అందజేయడంతో, ట్రిబ్యునల్ విచారణ జరిపి అది దేవాలయ భూమిగా నిర్ధారించింది. దీంతో సమస్య సద్దుమణిగిన భూమిని మాత్రం స్వాధీనం చేసుకోలేదు.
"దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఉన్న వందల ఎకరాలు భూములు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అందులోనూ నల్గొండ జిల్లా చూసుకుంటే బ్రహ్మం గారి గుట్ట, కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయానికి వందల ఎకరాల భూమి ఉంది. దానిపై గత పదిహేను సంవత్సరాలు క్రితం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వాటిని ప్లాట్లుగా వేసుకొని అమ్ముకున్నా సరే, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కోర్టు నుంచి తీర్మానం వచ్చినా కూడా దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది."-జెల్లెల గోవర్ధన్, రాష్ట్రీయ శ్రీరాంసేన అధ్యక్షుడు