No Free Ticket For Women in Semi Deluxe Buses :ఆర్టీసీలో కొత్త రకం సెమీ డీలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో మాదిరి మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండదు. ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ రూ.30. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటివి ఎక్స్‌ట్రా. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు మధ్యరకంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్నది ఈ బస్సులు రోడ్డెక్కిన తర్వాతే స్పష్టత రానుంది.
మహాలక్ష్మి పథకంతో తగ్గిన టికెట్ల విక్రయం : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఆర్టీసీ సంస్థ మొత్తం బస్సుల్లో, ఈ రెండు రకాల బస్సుల సంఖ్య దాదాపు 80 శాతం ఉంటాయి. దీంతో సంస్థకు రోజువారీ ప్రత్యక్షంగా వచ్చే టికెట్ల ఆదాయంపై భారీ ప్రతికూల ప్రభావం పడింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ కొంత జాప్యం అవుతోంది. డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకునే ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే కొత్త రకం బస్సులను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా త్వరలోనే కొత్త బస్సులు : మంత్రి పొన్నం - Minister Ponnam Review on RTC
ఇందులో భాగంగా తొలి దశలో 50 సెమీడీలక్స్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిసింది. మరోవైపు డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని పెంచేందుకు కొన్ని డిపోల్లో ‘బహుమతి’ ఇచ్చే పథకాలను ఆర్టీసీ మొదలు పెట్టింది. మహాలక్ష్మి పథకంతో పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు ఎక్స్‌ప్రెస్ తరహా బస్సులనే రంగు, రూపం కొంత మార్చి సెమీడీలక్స్ పేరుతో ఆర్టీసీ ప్రవేశపెడుతుందా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
కొత్తగా వచ్చిన సెమీడీలక్స్ బస్సులను ఆర్టీసీ కొద్దిరోజుల క్రితమే కరీంనగర్ సహా పలు రీజియన్లకు పంపించింది. కి.మీ.కు ఛార్జి 137 పైసలుగా తెలిపింది. ఈ వివరాల్ని తాజాగా ఈడీలు, రీజినల్ అధికారులకు పంపించింది. ప్యాసింజర్ ఫీజు కింద రూ.5, సేఫ్టీ ఫీజు కింద రూ.1, అదనంగా రూ.6 చెల్లించాలని పేర్కొంది. ఈ తరహా రుసుములు ఇతర బస్సుల్లోనూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సెమీడీలక్స్ ప్రయాణమార్గంలో టోల్ గేట్లు ఉంటే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.13 టోల్ ఛార్జి వసూలు చేయనున్నట్లు సమాచారం.
ఉచిత బస్సు పథకంపై కావాలనే అవహేళన వీడియోల ప్రచారం : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON FREE BUS VIDEOS
మెట్రో లేని ప్రాంతాల్లో 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు - ప్రయోగాత్మకంగా ఈ మార్గాల్లో అమలు - RTC Routes Bus Extended in Hyd