Telangana RTC Buses Crossing 100 percent OR Rate : ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఈ రద్దీ మరింత ఎక్కువైంది. ఈ పథకానికి ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉంటే, ఇప్పుడు తరచూ 100 శాతం దాటేస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన (సోమవారం) ఏకంగా 114.28 శాతం ఓఆర్ నమోదవ్వగా, 20న 108.38 శాతం నమోదైంది.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. గతంలో 8 లక్షల కి.మీ దాటిన బస్సుల్ని తుక్కుగా మార్చేవారు. ఇప్పుడు 14-15 లక్షల కి.మీ దాటినా వాటిని నడిపిస్తున్నారు. పాత బస్సులు పలుసార్లు బ్రేక్‌డౌన్లు అవుతున్నాయి. నిర్వహణ సమస్యలు సైతం అధికం కావడంతో మెకానిక్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. కెపాసిటీ పెరగడం వల్ల ఓవర్ వెయిట్ అయ్యి బస్సులు తుక్కు పడుతున్నాయి.
వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం
100 Percent Occupancy in RTC Buses :పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంతో పాటు పెరిగిన రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడప్పుడు కొత్త బస్సులు వస్తున్నా, మొత్తం బస్సులతో పోలిస్తే వాటి సంఖ్య అరకొరగా మాత్రమే ఉంటుంది. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా అద్దె వాటితో కలిపి 9,200 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఐదు వేల బస్సులకు పైగా పాతవే. అద్దె బస్సులను ఒప్పందం ముగిశాక పక్కన పెడుతున్న ఆర్టీసీ, సొంత బస్సులను మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్తవి తీసుకురాలేకపోతుంది.