Telangana Phone Tapping Case Updates :ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు కీలకమైన హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌తో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
Task Force EX OSD Radhakishan Rao Case :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిన సమయంలో ఎస్ఐబీలో పనిచేసిన ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో వాంగ్మూలాలు సేకరిస్తోంది. అలాగే క్షేత్రస్థాయి ఆపరేషన్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై గట్టుమల్లు సహా ఇతర పోలీసుల వాంగ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటుటాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుల (Task Force Radhakishan Rao Case) ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈ వాంగ్మూలాల ద్వారా తేట తెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయమూర్తి ముందు పెట్టనున్నట్లు సమాచారం.
Praneeth Rao Phone Tapping Case :గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్టీగా రాధాకిషన్‌రావులు ఆడిందే ఆటగా సాగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమమని తెలిసినా రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ యథేచ్ఛగా సాగిపోయిందని, ఆ ఇద్దరూ బాస్‌లు కావడంతో వారి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తూచా తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాలను బట్టి తెలుస్తోంది. గతంలో ఎస్ఐబీలో పనిచేసి ప్రసుత్తం సీఐడీలో ఉన్న ఓ ఇన్స్‌పెక్టర్ వాంగ్మూలాన్ని సైతం దర్యాప్తు బృందం సేకరించింది. ఆయన ఎస్ఐబీలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు ప్రణీత్‌రావుల సూచనల మేరకు అనధికారిక నిఘా ఎలా కొనసాగిందో దర్యాప్తు బృందానికి కూలంకషంగా వివరించినట్లు సమాచారం.
ఇతర పార్టీల నగదు అక్రమ తరలింపుపై ఫోకస్ : టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నేతృత్వంలో ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును అడ్డుకుని, ఎలా జప్తు చేశారనేది వెల్లడించినట్లు సమాచారం. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ఇప్పుడూ అక్కడే ఉన్న మరో ఇన్స్‌స్పెక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఎనిమిది సార్లు ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును ఎలా పట్టుకోగలిగామనే విషయాన్ని విచారణలో వెల్లడించారు.