Telangana Phone Tapping Case Updates :రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది. ఎస్ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో ఇద్దరు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నిందితులిద్దరి పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో, వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఫోన్ టాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్ - Telangana Phone Tapping Case Update - TELANGANA PHONE TAPPING CASE UPDATE
Telangana Phone Tapping Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావుకు కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది. నిందితులిద్దరి పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం, వారిచ్చిన సమాచారంతో ఇంకొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
Published : Apr 2, 2024, 12:21 PM IST
|Updated : Apr 2, 2024, 12:54 PM IST
ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం వారిని నాంపల్లిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం, వీరిద్దరి వాంగ్మూలం ఆధారంగా మరింత మందికి నోటీసులు జారీ చేసి పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Task Force EX OSD Radhakishan Rao Arrest Updates :మరో వైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును ఇదే వ్యవహారంలో పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పంజాగుట్టు పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందన కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరారు. ఈ విషయంపై కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులకు వరుస ఫిర్యాదులు అందుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విశ్రాంత పోలీసు అధికారి వేణుగోపాల్‌రావు పేరు కూడా రాధాకృష్ణరావు ప్రస్తావించడంతో, అతనికి నోటీసులు జారీ చేసి పోలీసులు విచారణ జరపాలని భావిస్తున్నారు.