Telangana MP Candidates Cast Votes: తెలంగాణలో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థిలుగా పోటీ చేస్తున్న నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బర్కత్‌పురాలోని పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు, నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దంపతులు తమ ఓటు వేశారు. మేడ్చల్ జిల్లా పూడూరులో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, హనుమకొండ టీచర్స్ కాలనీలో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహబూబ్‌నగర్ టీచర్స్ కాలనీలో మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, చేవెళ్ల గొల్లపల్లిలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ గుండూరులో నాగర్‌కర్నూల్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, అలంపూర్‌లో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్, సిద్దిపేట దుబ్బాక బొప్పాపూర్‌లో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, రంగారెడ్డి పసుమాములలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, మహబూబాబాద్ అభ్యర్థి మాలోతు కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం ఎంపీ అభ్యర్థులు: కొత్తగూడెం ములకలపల్లిలో ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, మాదాపురంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి, ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సూర్యాపేట గుండ్లపల్లిలో నల్గొండ బీజేపి అభ్యర్థి సైదిరెడ్డి, ఉట్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
మోండా మార్కెట్‌లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, పటాన్‌చెరు మండలం చీట్కుల్‌లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, జగిత్యాలలో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.