TG Minister Tummala Nageswarao Impatience on AP Roads: రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామంటూ నిత్యం డప్పు కొట్టుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలకు అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం అంటే ఏంటో తెలుసా ? మాట్లాడితే చాలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేల కోట్ల రూపాయలు వేశామంటున్న జగన్ రహదారులను బాగు చేసే బటన్ ఎందుకు నొక్కట్లేదు ? గ్రామ స్వరాజ్యం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న పాలకులు కనీసం రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. అల్లూరి జిల్లాలోని ఎటపాక- కన్నాయిగూడెం రహదారే ఇందుకు నిదర్శనం. ఇదే రోడ్డుపై బుధవారం తెలంగాణ మంత్రి ప్రయాణించగా ఆయన అసహనానికి గురయ్యారు.
అల్లూరి జిల్లాలోని ఎటపాక - కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. 'ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవని' తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోడ్డును మీరు మరమ్మతులు చేయిస్తారా లేదంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా అని తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్‌అండ్‌బీ అధికారిని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల బుధవారం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక- కన్నాయిగూడెం రహదారిలో ప్రయాణించారు.
ఎదురుగా బండొస్తే గల్లంతే- కరకట్ట దారిలో కాచుకున్న మృత్యువు! - People Problems with Damaged Roads