Telangana Health Department Jobs : వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొంది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన బోర్డ్, తాజాగా మరో 272 పోస్టులను జతచేసింది. దీనితో మొత్తం భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2322 కు చేరాయి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - TELANGANA HEALTH DEPT VACANCIES
ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ - ఫార్మాసిస్ట్ పోస్టులకు నవంబర్ 30న పరీక్ష
Telangana Health Dept Vacancies (ETV Bharat)
Published : Oct 11, 2024, 7:19 PM IST
మరోవైపు 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనితో మొత్తం పోస్టుల సంఖ్య 732కి చేరింది. ఈ నెల 14 లోపు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపిన బోర్డ్, నవంబర్ 17 న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఫార్మాసిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 30 న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.