Political Leaders Cast Their Vote in Telangana 2024 :రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణ పౌరులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు తమ తమ పోలింగ్ బూత్‌లలో ఓటు వేసి 'మా వంతు అయిపోయింది, ఇక మీ వంతే మిగిలింది' అంటూ సందేశమిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
హైదరాబాద్ బర్కత్‌పురాలో కిషన్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్‌రెడ్డి పాఠశాలలో వెంకయ్యనాయుడు దంపతులు ఓటేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటు వేశారు.