ETV Bharat / state

ఏపీ మంత్రివర్గ సమావేశం - 21 అంశాలపై కీలక నిర్ణయాలు - AP CABINET MEETING HIGHLIGHTS

సీఅర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర - అమ‌రావ‌తిలో రూ.24,276 కోట్ల విలువైన ప‌నులకు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు

AP Cabinet Meeting
AP Cabinet Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 1:05 PM IST

Updated : Dec 19, 2024, 6:09 PM IST

AP Cabinet Meeting Highlights: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో 21 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24 వేల 276 కోట్లు విలువైన పనులకు పాలనపరమైన అనుమతులిచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రుణం, KFW ఆర్థిక సంస్థ ద్వారా 5 వేల కోట్ల రుణం పొందడానికి ఆమోదం తెలిపింది.

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మగానిపల్లెలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50.21 ఎకరాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు అంగీకారం తెలిపింది. 50 వేల వరకూ ఉన్న రుణాలపై స్టాంప్‌ డ్యూటీ మినహాయింపును ఆమోదించింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి..కేబినెట్‌ సమ్మతి తెలిపింది. ఈ నిధులు పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయడానికి అంగీకరించింది.

పోలవరం ఎడమ కాలువ పనుల్లో కొన్ని ప్యాకేజీలకు రీ టెండర్‌ను కేబినెట్‌ ఆమోదించింది. హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు సమ్మతి తెలిపింది. క్లీన్‌ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడులకు జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 475 జూనియర్‌ కళాశాలల్లో.. మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. 32కోట్ల వ్యయంతో ఇంటర్‌ విద్యార్దులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్దుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ఉపన్యాసాలు ఇప్పించాలని నిర్ణయించింది.

ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యంచేసిన అంశంపై కేబినెట్‌ చర్చించినట్లు సమావేశం తర్వాత చెప్పిన మంత్రి పార్థసారథి కొన్నింటికి రీ టెండర్‌ పిలవడం సహా మరికొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని సూచించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోవడం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మంత్రి వద్దకు వచ్చిన దస్త్రం ఎంత సేపు పెండింగ్‌లో ఉంటుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఇంచార్జ్ మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవడంలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న సీఎం స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు.

నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం

Last Updated : Dec 19, 2024, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.