- శాసనసభ రేపటికి వాయిదా
- రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ వాయిదా
- పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ వాయిదా
LIVE UPDATES : శాసనసభ రేపటికి వాయిదా - TELANGANA ASSEMBLY LIVE UPDATES
Published : Dec 17, 2024, 10:19 AM IST
|Updated : Dec 17, 2024, 3:57 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ మూడో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇస్తున్నారు. గంట పాటు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం శాసనసభ, శాసన మండలిలో కొనసాగుతుంది. ఆ తర్వాత సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. తర్వాత శాసనసభ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉభయ సభల్లో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడో వార్షిక నివేదిక ప్రవేశ పెడతారు.
LIVE FEED
- రాష్ట్ర పర్యాటక విధానంపై సభలో కొనసాగుతున్న చర్చ
- కొనసాగుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల ఆందోళన
- విపక్షాల ఆందోళన మధ్యే కొనసాగుతున్న చర్చ
- మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం
- స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం
- యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు ఆమోదం
- విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- తెలంగాణ జీఎస్‌టీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన బిల్లులకు ఆమోదం
- ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు ఆమోదం
- విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ
- ఎలాంటి చర్చ లేకుండానే విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
- బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుల ఆమోదం
- జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు
- జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- ఎలాంటి చర్చ లేకుండానే జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
- యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై సభలో చర్చ
- వాయిదా తీర్మానాల కోసం పట్టుబడుతున్న బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు
- లగచర్ల ఘటనపై చర్చకు విపక్షాల పట్టు
- సర్దిచెప్పేందుకు యత్నిస్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు
- గందరగోళం మధ్య చర్చ లేకుండానే స్పోర్ట్స్ బిల్లుకు ఆమోదం తెలిపిన సభ
నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా*
- నియోజకవర్గాల అభివృద్ధికి సీడీపీ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు
- అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నిధులు విడుదల చేసుకుంటున్నారు
- మా నియోజకవర్గాలు అభివృద్ది జరగవద్దా
- పక్షపాతం లేకుండా పాలన చేస్తాననీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు
- *సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు@అసెంబ్లీ*
- కొత్తగూడెం, పాల్వంచ జంట నగరాలుగా ఉంటాయి
- హైదారాబాద్, సికింద్రాబాద్ జంటగా ఉన్నాయి
- వరంగల్, హన్మకొండ జంట నగరాలుగా ఉన్నాయి
- కొత్త గూడెం, పాల్వంచ జంట నగరాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి
- డిపోలకు బస్సులు ఇవ్వాలన్న విజ్ఞప్తులన్నీ త్వరలో నెరవేరుస్తాం:పొన్నం
- కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తాం:పొన్నం
- 15ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నాం:పొన్నం
పాల్వాయి హరీశ్‌బాబు
గిరిజన ప్రాంతాలకు బస్సు డిపోను కేటాయించాలి: పాల్వాయి
వివేక్ వెంకటస్వామి
చాలా వరకూ రోడ్లు మరమ్మతులు చేయలేదు: వివేక్ వెంకటస్వామి
బస్సు సర్వీసులను తిరిగి తొందరగా మొదలు పెట్టాలని కోరుతున్నాం: వివేక్ వెంకటస్వామి
ఆర్టీసీ బస్సులు చెన్నూరుకు ఎక్కువ కేటాయించాలి: వివేక్ వెంకటస్వామి
- చాలా వరకూ రోడ్లు మరమ్మతులు చేయలేదు: వివేక్ వెంకటస్వామి
- బస్సు సర్వీసులను తిరిగి తొందరగా మొదలు పెట్టాలని కోరుతున్నాం: వివేక్ వెంకటస్వామి
- ఆర్టీసీ బస్సులు చెన్నూరుకు ఎక్కువ కేటాయించాలి: వివేక్ వెంకటస్వామి
- రూ.లక్ష కోట్లు అప్పు మేము చేయలేదు: భట్టి
- రూ.52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నాము:భట్టి
- గతం ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతున్నాం: భట్టి
- సివిల్ సప్లై బిల్లులు కూడా రూ.62 వేల కోట్లు అప్పుచేసిపెట్టారు:భట్టి
- ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి పంటను కొంటున్నాం:భట్టి
- సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తున్నాం:భట్టి
- ఉచిత కరెంటు ఇస్తున్నామని డిస్కంలకు కూడా డబ్బులు చెల్లించలేదు:భట్టి
- గతంలోని డిస్కం బిల్లులు కూడా మేమే చెల్లిస్తున్నాం:భట్టి
- ప్రతి శాఖలోనూ బకాయిలు ఉంచారు:భట్టి
- అసెంబ్లీకి నల్ల చొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ నిరసన
శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- హామీల అమలులో ప్రభుత్వం విఫలంపై చర్చించాలని వాయిదా తీర్మానం
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ
శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మాన ప్రతిపాదన
- శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మాన ప్రతిపాదన
- పరిశ్రమల పేరిట బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టులపై ప్రతిపాదన