తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 26 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Thu Sep 26 2024 లేటెస్ట్‌ వార్తలు- రామాంతపూర్ పెద్దచెరువు ఎఫ్​టీఎల్​​ను 6నెలల్లో నిర్ధారించండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - HC On Ramanthapur Pedda Cheruvu

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 26, 2024, 7:10 AM IST

Updated : Sep 26, 2024, 10:33 PM IST

10:33 PM, 26 Sep 2024 (IST)

రామాంతపూర్ పెద్దచెరువు ఎఫ్​టీఎల్​​ను 6నెలల్లో నిర్ధారించండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - HC On Ramanthapur Pedda Cheruvu

Ramanthapur Pedda Cheruvu FTL Limit : రామంతపూర్‌ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌)ను నిర్ధారించాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్​ను ఆదేశించింది. 6 నెలల్లోగా ఆ ప్రక్రియను పూర్తిచేసి, తుది నోటిఫికేషన్​ జారీ చేయాలని పేర్కొంది. ఫైనల్​ నోటిఫికేషన్ తర్వాత అక్రమ నిర్మాణం అని తేలితే తొలగించడంతో పాటు చెరువు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. | Read More

ETV Bharat Live Updates - HIGH COURT ON PEDDA CHERUVU

09:11 PM, 26 Sep 2024 (IST)

వీరనారి చాకలి ఐలమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు - Chakali Ilamma Jayanthi 2024

Chakali Ilamma Jayanthi Celebrations 2024 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని ఆమెకు ప్రజలు ఘన నివాళి అర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో రజాకార్లకు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించాలని నేతలు పిలుపునిచ్చారు. | Read More

ETV Bharat Live Updates - CHAKALI ILAMMA JAYANTHI 2024

07:50 PM, 26 Sep 2024 (IST)

సీసీఎంబీ 'ఓపెన్‌ డే' - పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన - CCMB HYD Open Day Programme

CCMB Open Day Programme : సీఎస్‌ఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సీసీఎంబీలో నిర్వహించిన 'ఓపెన్‌ డే' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పలు ప్రాంతాలనుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. సీసీఎంబీ పరిశోధనలు, వాటి అనువర్తనాల గురించి శాస్త్రవేత్తలు విద్యార్థులకు వివరించారు. | Read More

ETV Bharat Live Updates - CCMB HYD OPEN DAY PROGRAMME

07:22 PM, 26 Sep 2024 (IST)

అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ 'కాళేశ్వరం ప్రాజెక్టు' : సీఎం రేవంత్‌ - CM REVANTH ON AEE APPOINTMENTS

CM Revanth AEE Appointments Orders : అధికారులు ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు సీఎం చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. | Read More

ETV Bharat Live Updates - AEE POSTS APPOINTMENT LETTERS

07:11 PM, 26 Sep 2024 (IST)

పారేసే ప్లాస్టిక్​తో రైల్వేకు కాసుల వర్షం - కిలో చెత్తకు ఎంత ఆదాయం వస్తుందంటే? - ScrapQ Agreement with SCR

ScrapQ Agreement with SCR : దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణికులతో పాటు వారి ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా అంతే మొత్తంలో పోగవుతుంటాయి. గతంలో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ప్లాస్టిక్ వ్యర్థాలే రైల్వేకు కాసులు కురిపిస్తున్నాయి. ఇంతకీ పారవేసే ప్లాస్టిక్​తో రైల్వేకు ఆదాయం ఎలా సమకూరుతుంది? ప్లాస్టిక్​ను తీసుకెళ్లే వారు రైల్వేకు ఎంత చెల్లిస్తారు? తదితర అంశాలపై ప్రత్యేక కథనం. | Read More

ETV Bharat Live Updates - SCR DEAL WITH SCRAPQ

06:11 PM, 26 Sep 2024 (IST)

30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌కార్డులను తీసుకువస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth On Digital Health Cards

CM Revanth On Digital Health Cards : మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం, విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - DIGITAL HEALTH CARDS IN TELANGANA

05:30 PM, 26 Sep 2024 (IST)

తిరుపతి లడ్డూ వివాదం - పేర్ని నాని వ్యాఖ్యలపై జనసేన నేతల ఆందోళన - PROTESTS AT PERNI NANI HOUSE

Protests at Perni Nani House : తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు | Read More

ETV Bharat Live Updates - TENSION IN MACHILIPATNAM

05:20 PM, 26 Sep 2024 (IST)

డీజే శబ్దాలు కట్టడి చేయాల్సిందే! - రాజకీయ పార్టీల లీడర్లతో సీపీ రౌండ్‌ టేబుల్ సమావేశం - CP CV Anand On DJ Sound Pollution

CP CV Anand On DJ Sound Pollution : డీజేల వాడకం విషయంలో త్వరలో గైడ్‌లైన్స్‌ జారీ చేస్తామని రాష్ట్ర డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు కార్యచరణ ప్రారంభించారు. ర్యాలీల్లో డీజేలు, టపాసుల వాడకంపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ రౌండ్ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని నివాసాల్లో వయసు మీరిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని సీపీ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - CP CV ANAND ON DJ SOUND POLLUTION

04:27 PM, 26 Sep 2024 (IST)

ఎంఎస్‌ఎంఈలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం - వృత్తి నైపుణ్యం పెంచేందుకు సర్కారు చర్యలు ఇవే - NEW MSME Policy In Telangana

NEW MSME Policy In Telangana : ఒక రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగానిది ఎంతో కీలక పాత్ర. ఈ రంగం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతోంది. కేవలం భారీ పరిశ్రమల ద్వారానే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎంఎస్‌ఎంఈలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న వాటికంటే అదనంగా ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. భూమిని తక్కువ ధరకు ఇవ్వడం దగ్గరి నుంచి రుణాలు సులభంగా అందేలా చూడటం పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎంఎస్‌ఎంఈ నూతన విధానంలో ఉన్నాయి. | Read More

ETV Bharat Live Updates - MSME POLICY

03:57 PM, 26 Sep 2024 (IST)

ఆన్​లైన్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం - త్వరలో రంగంలోకి దిగనున్న సైబర్ కమాండోలు - Cyber Commandos Training

Cyber Commandos Recruitment : దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. వీటిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం అయిదు వేల సైబర్ కమాండోలను సిద్దం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే కమాండోల ఎంపిక కోసం శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా, వారిలో 346 మందిని షార్ట్​లిస్ట్ చేశారు. తెలంగాణ నుంచి ఒకే ఒక్క పోలీసు అధికారి వరంగల్​ కమిషనరేట్​లో పనిచేసే ప్రశాంత్​కుమార్ ఎంపికయ్యారు. | Read More

ETV Bharat Live Updates - TG POLICE SELECT AS CYBER COMMANDO

03:57 PM, 26 Sep 2024 (IST)

YUVA : రైతుబిడ్డ తలరాత మార్చిన పద్యరచన - 1900లకు పైగా రచనలతో బాల కవయిత్రిగా గుర్తింపు - Sangareddy Young Poet Anitha Story

Young Poet Anitha Story : ప్రతి ఒక్కరూ జీవితంలో మొట్టమొదట నేర్చుకునే భాష అమ్మ భాష. కానీ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయనో, ఇతర కారణాల వల్లో మాతృభాషను చిన్నచూపు చూస్తున్నారు తెలుగువారు. కనీసం రాయలేని స్థితికి చేరుకుంటున్నారు. అలాంటిది తేట తెలుగులో ఏకంగా పద్యాలనే అలవోకగా రాసేస్తోంది ఓ యువతి. సొంతంగా 1900లకు పైగా పద్యాలు రచించి బాల కవయిత్రిగా పేరు తెచ్చుకుంది. పద్యరచనతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న అనిత కథే ఇది. | Read More

ETV Bharat Live Updates - YOUNG POET ANITHA STORY

03:54 PM, 26 Sep 2024 (IST)

రాష్ట్రంలో సిరుల పంట - వరి ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ - Rice Crop Yield in Telangana

Telangana Top Place in Rice crop Yield : తెలంగాణలో సిరుల పంట పండుతోంది. 2023-24 సంవత్సరంలో 168.74 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, పెరిగిన నీటిపారుదల సౌకర్యాలతో రాష్ట్రం ధాన్యలక్ష్మికి నిలయంగా మారింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RANKED FIRST IN RICE CROP

02:43 PM, 26 Sep 2024 (IST)

గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం - ప్రకాశ్‌రాజ్‌ మరో ట్వీట్ - PRAKASH RAJ On Tirumala Laddu

Prakash Raj On Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదం తర్వాత ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ వరుస ట్వీట్లు పెడుతున్నారు. లడ్డూ వివాదంపై ఆయన పెట్టిన ట్వీట్‌ వైరలైంది. తాజాగా వీడియో ఎక్స్‌లో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌ కాగా ఎవరిని ఉద్దేశించి పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - PRAKASH RAJ VS PAWAN KALYAN

01:13 PM, 26 Sep 2024 (IST)

ఈ పాఠాల పరమార్థం వేరు - నగరంలో నేర ముఠాల నయా ఎత్తుగడలు - Thefts in Hyderabad

New Type Thefts In Hyderabad : మనం బస్సులో గానీ, ఆటోలో గానీ వెళ్తుండగా పక్కనే కూర్చుంటారు. పిల్లలే కదా అని ఆశ్రద్ధ చేశామంటే చాలు. చూస్తుండగానే మన జేబులోని ఫోన్ లేదా పర్సును​ మాయం చేస్తారు. ఒకవేళ చోరీ చేస్తుండగా పట్టుకున్నా, వెంటనే ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గొడవ చేయడం మొదలుపెడతుంది. ఇదంతా ప్రస్తుతం సిటీలో నడుస్తున్న నయా దందా. ఈ తరహా నేరాలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - NEW TYPE THEFTS IN HYDERABAD

12:24 PM, 26 Sep 2024 (IST)

ఈటీవీ బ్యూరో చీఫ్‌ ఆదినారాణయ మృతి - ఇరురాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖుల సంతాపం - Senior Journalist Adinarayana

ETV Hyderabad Bureau Chief Adinarayana Passed Away : సీనియర్‌ జర్నలిస్ట్‌, ఈటీవీ బ్యూరో చీఫ్‌ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్​మెంట్​పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడగా, కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. | Read More

ETV Bharat Live Updates - SENIOR JOURNALIST ADINARAYANA DIED

12:26 PM, 26 Sep 2024 (IST)

'మద్యం ప్రియులకు శుభవార్త - బీర్ల కొరతేమీ లేదు - పుష్కలంగా తాగండి' - No Liquor Shortage in AP

No Shortage Of Liquor Stocks : మందుబాబులకు ఏపీ అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తీపి కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - NO SHORTAGE OF LIQUOR STOCKS

12:06 PM, 26 Sep 2024 (IST)

నిద్రపోయి అక్షరాలా రూ.9 లక్షలు గెలిచిన యువతి - మీరూ పాల్గొంటారా? - Woman Wins 9 lakh By Sleeping

Bangalore Woman Wins Sleep Internship Program : స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న బెంగళూరుకు చెందిన ఓ యువతి అక్షరాలా రూ.9 లక్షలు గెలుచుకుంది. దానికి సంబంధించిన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - WOMAN WINS 9 LAKH BY SLEEPING

11:51 AM, 26 Sep 2024 (IST)

మూసీ ప్రక్షాళన షురూ - పరీవాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్​ - ఆ భవనాలకు మార్కింగ్ - Musi River Re Survey

Musi River Re Survey : మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - MUSI RIVER RE SURVEY

11:49 AM, 26 Sep 2024 (IST)

వైరల్​ వీడియో : చెరువులోనే బహుళ అంతస్తుల భవనం - బాంబులతో కూల్చేసిన అధికారులు - Demolishing at Malkapur Cheruvu

Demolish in Malkapur : చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇవాళ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి, శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. | Read More

ETV Bharat Live Updates - CONSTRUCTION DEMOLISH AT MALKAPUR

10:50 AM, 26 Sep 2024 (IST)

బీట్ ఏదైనా ఓకే - కానీ సినిమా పాటే కావాలి - యూత్​ అంటే అట్లుంటది మరి - HCU On Students Music Taste

HCU on Youngsters Music Tastes : తెలుగు పాటలు, పద్యాలు, జాన పదాలు, పాశ్చాత్య సంగీతం. వీటిన్నింటిలో మీకు ఏది ఇష్టమని అడిగితే, సినిమా పాటలే ఇష్టమని అంటున్నారు యువతీ యువకులు. గతేడాది హెచ్‌సీయూలోని సంగీత విభాగం విద్యార్థుల సంగీత, సాహిత్య అభిరుచులపై అధ్యయం చేసింది. తాజాగా నాద్‌-నర్తన్‌ జర్నల్‌ దీనిని ప్రచురించింది. దాదాపు 350 మందిలో 168 మంది సినిమా సంగీతాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - YOUNGSTERS MUSICAL TASTES

10:50 AM, 26 Sep 2024 (IST)

దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - APSRTC Special Buses for Dussehra

APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం వచ్చే నెల 3 నుంచి 12 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్​లో విద్య, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న పలు జిల్లావాసుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నాన్నట్లు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates - APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA

10:33 AM, 26 Sep 2024 (IST)

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Tirupati laddu Controversy

Inferior Ingredients in Srivari Prasadam: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాల్లో జీడి పప్పు, యాలకులు, కిస్‌మిస్‌ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ జరిగిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఈ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. | Read More

ETV Bharat Live Updates - TIRUPATI LADDU CONTROVERSY

10:33 AM, 26 Sep 2024 (IST)

వరద నీటిలో తిరిగిన 12 ఏళ్ల బాలుడు - కండరాలు తినేసిన బ్యాక్టీరియా - కుడి కాలు తొడ వరకు! - Boy Suffer Necrotizing Fasciitis

Necrotizing Fasciitis Disease : అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' వ్యాధితో 12 ఏళ్ల భవదీప్‌ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? | Read More

ETV Bharat Live Updates - NECROTIZING FASCIITIS DISEASE

09:14 AM, 26 Sep 2024 (IST)

చిన్నవాటికీ యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా? - మితిమీరితే మీ బుజ్జాయికి ముప్పేనట - Antibiotics Effecs on Children

Excess Use of Antibiotics Leads to Health Problems : ఉబ్బసం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిలోఫర్‌ ఆసుపత్రి సీనియర్‌ పీడియాట్రీషియన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తోట ఉషారాణి ఈటీవీ భారత్‌కు వివరించారు. | Read More

ETV Bharat Live Updates - ANTIBIOTICS EFFECS ON CHILDREN

08:51 AM, 26 Sep 2024 (IST)

ఇకపై విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ - దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం - Telangana Govt on Vijaya Dairy Ghee

Telangana Govt on Temples about Ghee : రాష్ట్రంలోని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ అన్నీ దేవాలయాలు ప్రైవేటుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని కోరినా ఒక్క ఆలయం కూడా కొనలేదని గుర్తించింది. | Read More

ETV Bharat Live Updates - GOVT ON TEMPLES ABOUT VIJAYA GHEE

07:43 AM, 26 Sep 2024 (IST)

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు - దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం - CM Revanth On Indiramma Houses

Indiramma House Updates : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దసరా నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలని వారికి ఇళ్లు దక్కాలని అన్నారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH ON INDIRAMMA HOUSES

07:37 AM, 26 Sep 2024 (IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్‌ - తెలంగాణలో రెండు రోజులు వానలే వానలు - Heavy Rain Alert To Telangana

Heavy Rain Alert To Telangana : బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడం బలహీనపడిన కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో వానలు పడే అవకాశముందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN ALERT TO TELANGANA

06:58 AM, 26 Sep 2024 (IST)

700 మంది AEEలకు నేడు నియామక పత్రాలు - కొత్తగా 1800 లష్కర్ పోస్టుల భర్తీకి సీఎం ప్రకటన! - CM Revanth AEE Appointments orders

AEE Appointments Today : నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలోని ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 1800 లష్కర్ పోస్టులను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. | Read More

ETV Bharat Live Updates - AEE APPOINTMENTS TODAY
Last Updated : Sep 26, 2024, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details