తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 28 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sat Sep 28 2024 లేటెస్ట్‌ వార్తలు- 'ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు' - CM On Family Digital Health Cards

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 28, 2024, 7:10 AM IST

Updated : Sep 28, 2024, 10:24 PM IST

10:24 PM, 28 Sep 2024 (IST)

'ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు' - CM On Family Digital Health Cards

CM Revanth Review On Family Digital Health Cards : కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. | Read More

ETV Bharat Live Updates - FAMILY DIGITAL HEALTH CARDS

09:18 PM, 28 Sep 2024 (IST)

త్వరలోనే పూర్తిస్థాయిలో పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన - మహేశ్​కుమార్ గౌడ్ - Mahesh Kumar Goud Chit Chat

Maheshkumar Goud Chitchat : రాష్ట్రంలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంతో, పాత పీసీసీ కార్యవర్గం రద్దు అయ్యిందని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన అనంతరం డీసీసీ అధ్యక్షుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - MAHESH KUMAR GOUD SLAMS HARISH RAO

07:20 PM, 28 Sep 2024 (IST)

హైదరాబాద్​లో చెత్త శుద్ధి కేంద్రాలపై జీహెచ్ఎంసీ కసరత్తు - జవహర్​నగర్​పై తగ్గనున్న ఒత్తిడి - Ghmc Planning To Dumping Yards

Dumping Yard Problems In Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే చెత్తతో జవహర్​నగర్ డంపింగ్ యార్డ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రత్యమ్నాయ మార్గాలు లేక వేలాది టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. జవహర్​నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడిని తగ్గించాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నాలుగు జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అక్కడ వినూత్న, ఆధునిక పద్దతిలో చెత్త శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. | Read More

ETV Bharat Live Updates - DUMPING YARD PROBLEMS IN HYDERABAD

07:17 PM, 28 Sep 2024 (IST)

పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదు : రంగనాథ్‌ - HYDRA RANGANATH COMMENTS

Hydra Ranganath Comments : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం రేవంత్​రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతనని ఆయన వెల్లడించారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని దీనిని బూచిగా చూపించవద్దని రంగనాథ్ స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates - HYDRA RANGANATH REACTS DEMOLITIONS

06:09 PM, 28 Sep 2024 (IST)

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య : హరీశ్ రావు - Harish Rao Fires On CM Revanth

Harish Rao Fires On CM Revanth : హైడ్రా కూల్చివేతలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు గాంధీ ఆసుపత్రి వద్ద పరామర్శించారు. హైడ్రాపై, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు అని హరీశ్​రావు ఆక్షేపించారు. | Read More

ETV Bharat Live Updates - HARISH RAO COMMENTS HYDRA

05:05 PM, 28 Sep 2024 (IST)

2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలనేదే ప్రభుత్వ లక్ష్యం - దాన కిశోర్ - Musi River Front Development

Musi River Front Development Project : మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. | Read More

ETV Bharat Live Updates - MUSI DEVELOPMENT MD DANA KISHORE

04:43 PM, 28 Sep 2024 (IST)

ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం - జైనూర్​ ఘటన మరువకముందే - MINOR GIRL RAPED IN ASIFABAD

Minor Girl Raped in Asifabad: కుమురం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. దీనిపై విద్యార్థులు, గ్రామస్థులు కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆడవాళ్లకు రక్షణ కరువైందని విద్యార్థులు భగ్గుమన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - MINOR GIRL RAPED IN ASIFABAD

04:36 PM, 28 Sep 2024 (IST)

విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ ఘోష్ తీవ్ర ఆగ్రహం - INQUIRY ON KALESWARAM PROJECT

Justice Ghosh Commission Inquiry Updates : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రత్యేకంగా మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్‌ ఫైల్స్‌ వినియోగించమని ఎవరు సూచించారని కమిషన్‌ ప్రశ్నించగా సీడీఓసీఈ సూచనల మేరకు ఇలా చేశానని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్​కు తప్పుడు సమాచారం ఇస్తారా అని మండిపడింది. వివిధ అంశాలకు సంబంధించి ఆయనను కమిషన్‌ ప్రశ్నించింది. | Read More

ETV Bharat Live Updates - PC GHOSH COMMISSION INQUIRY UPDATES

03:47 PM, 28 Sep 2024 (IST)

మగ్గంపై అద్భుత కళాఖండం - బంగారు చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేతన్న - Golden Saree Weaves in Sircilla

Golden Saree Weaves in Sircilla : బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్​కుమార్. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. | Read More

ETV Bharat Live Updates - NALLA VIJAYKUMAR WEAVE GOLDEN SAREE

03:42 PM, 28 Sep 2024 (IST)

న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకోవాలి: ద్రౌపది ముర్ము - President Murmu Visit Hyderabad

President Droupadi Murmu Visit Nalsar University in Hyderabad : ధనికుడితో పోలిస్తే పేదవాడు న్యాయం పొందడంలేదని మెరుగైన సమాజం కోసం న్యాయ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి సూచించారు. | Read More

ETV Bharat Live Updates - MURMU VISIT NALSARUNIVERSITY

02:58 PM, 28 Sep 2024 (IST)

మీరు కారుని అద్దెకిస్తున్నారా? అయితే జాగ్రత్త - మీకు తెలియకుండానే! - Car Rent Fraud In Kadapa

People Committing Frauds by Pawning Cars in Kadapa: కడపలో కొత్త తరహా మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కార్లను అద్దెకు తీసుకుని కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువ చేసే 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది. | Read More

ETV Bharat Live Updates - CARS SCAM IN KADAPA

02:20 PM, 28 Sep 2024 (IST)

పండుగ వేళ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త - ఆ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్ - 10 PERCENT DISCOUNT IN APSRTC

Dolphin Cruise and Amaravathi Buses : పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ప్రయాణికులకు గుడ్​న్యూస్ అందించింది. హైదరాబాద్​, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్​ నుంచి సొంతూర్లకు వెళ్లడానికి 10 శాతం రాయితీతో ఈ బస్సుల్లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - 10 PERCENT DISCOUNT IN APSRTC

01:29 PM, 28 Sep 2024 (IST)

జీవనదిలా మూసీ - మంచినీటిని వదిలేందుకు ప్రాజెక్టు నిర్మాణం కోసం వారంలో టెండర్లు - Fresh Water Project

Fresh Water Project Tender For Musi : మూసీ సుందరీకరణలో భాగంగా ఏడాది పొడవునా మంచినీటిని వదిలేందుకు వీలైన ప్రాజెక్టు నిర్మాణానికి వారం రోజుల్లో ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. | Read More

ETV Bharat Live Updates - FRESH WATER PROJECT

12:57 PM, 28 Sep 2024 (IST)

కావొచ్చు, తెలియదు, చెప్పలేను - 91 ప్రశ్నలకూ ఇవే సమాధానాలు! - Justice PC Ghose Enquiry

Justice PC Ghose Enquiry : కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ వేసిన ప్రశ్నలకు గజ్వేల్‌ ఈఎన్సీ, కేఐపీసీఎల్​​ (K.I.P.C.L) ఎండీ భూక్యా హరిరాం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, కాళేశ్వరం ఎత్తిపోతలు ఎవరి మానసపుత్రికో చెప్పాలని ప్రశ్నించింది. సుదీర్ఘ విచారణలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ 91 ప్రశ్నలు సంధించగా, చాలా వాటికి కావొచ్చు, తెలియదు, చెప్పలేను అంటూ హరి రాం సమాధానాలు ఇచ్చారు. ఆధార పత్రాలతో ఇవాళ మరోసారి కమిషన్‌ ఎదుట హాజరు కావాలని జస్టిస్‌ ఘోష్‌ ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates - KALESHWARAM PROJECT ISSUE

12:20 PM, 28 Sep 2024 (IST)

మత్తులో గొడవలు - అడ్డొస్తే హత్యలు - మహానగరంలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్​లు - ganja intoxicated murders in Hyd

Marijuana Intoxication in Hyderabad : నగరంలో గంజాయి బ్యాచ్​లు హల్​చల్​ చేస్తున్నాయి. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నా, హైదరాబాద్​లోకి గంజాయి కిలోల కొద్దీ వచ్చేస్తోంది. దీంతో నగరంలో మత్తుగాళ్లు ఎక్కువైపోయి గొడవలకు, హత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్​ నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మరింతగా కలవరపెడుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates - MARIJUANA INTOXICATION IN HYDERABAD

11:48 AM, 28 Sep 2024 (IST)

'గ్రూప్​-1 పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా - కొత్త నోటిఫికేషన్ చెల్లదు' - PETITIONS ON TG GROUP1 NOTIFICATION

Group-1 Mains Exams: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరో 20 రోజుల్లో జరగనుండగా, దీనిపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్​ను రద్దు చేయకుండా మరో కొత్త నోటిఫికేషన్​ను జారీ చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. | Read More

ETV Bharat Live Updates - HIGH COURT ON TGPSC GROUP1

10:48 AM, 28 Sep 2024 (IST)

'హైడ్రా, ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ - ఈ పేర్లు వింటేనే మా గుండె ఝళ్లుమంటుంది సారూ' - HYDRA Victims At Telangana Bhavan

HYDRA Victims At Telangana Bhavan : ప్రస్తుతం హైడ్రా, మూసీ, ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్ ఈ పదాలు వింటే హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తమ ఇళ్లను ఎక్కడ కూల్చేస్తారో అని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు వెళ్లి, బీఆర్​ఎస్ నేతలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - HYDRA VICTIMS AT TELANGANA BHAVAN

10:33 AM, 28 Sep 2024 (IST)

ఆ 1500 మందికి ATMలా బల్దియా - పని చేయకుండానే నెలనెలా జీతాలు - No Work But Taking Salary in GHMC

GHMC Salaries Scam : జీహెచ్‌ఎంసీలో దాదాపు 1500 మంది పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ఈ తంతు ఎప్పటి నుంచో నడుస్తోంది. అయినా దీనికి సంబంధించి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పని చేయకపోయినా జీతాలు తీసుకుంటూ బల్దియాను ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారు కొందరు. | Read More

ETV Bharat Live Updates - GHMC SALARY FRAUD NEWS LATEST

10:28 AM, 28 Sep 2024 (IST)

కంటైనర్​లో సిమ్లా నుంచి హైదరాబాద్‌కు యాపిల్స్‌ - ప్రమాదం జరిగిందని చెప్పి మాయం చేసిన డ్రైవర్లు - Drivers Stole a Lorry Of Apples

Drivers Stole a Lorry Of Apples : సిమ్లా నుంచి చెన్నైకి ట్రక్కులో యాపిల్స్​ను తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్లు వాటిని మాయం చేసిన ఘటన యాదాద్రి భువనగిరిలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. | Read More

ETV Bharat Live Updates - DRIVERS STOLE A LORRY OF APPLES

09:16 AM, 28 Sep 2024 (IST)

నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased

Essentials Prices Increased : పండుగల సీజన్‌ వేళ నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. నూనె, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పులు ఇలా ప్రతి ఒక్కదాని ధర అమాంతం పెరిగి, సామాన్య ప్రజలపై కొండంత భారాన్ని మోపుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates - ESSENTIALS PRICE INCREASED

08:49 AM, 28 Sep 2024 (IST)

'మా ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందేమో' - భయంతో మహిళ ఆత్మహత్య - Woman Suicide Due to Hydra

Woman Commits Suicide Due to Hydra : హైడ్రాకు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుందేమోనని భయంతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా దీనిపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కూడా స్పందించారు. | Read More

ETV Bharat Live Updates - WOMAN SUICIDE BY HYDRA

07:41 AM, 28 Sep 2024 (IST)

నేడు హైదరాబాద్​కు రాష్ట్రపతి రాక - సాయంత్రం వరకు ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - President Murmu visit hyderabad

President Murmu Visit to Telangana : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి శామీర్‌పేట సమీపంలో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహులు తదితరులు పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు జరగనున్న భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన దృష్టిలో పెట్టుకుని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. | Read More

ETV Bharat Live Updates - PRESIDENT DROUPADI MURMU

07:26 AM, 28 Sep 2024 (IST)

రామోజీ ఫిల్మ్​సిటీలో దసరా, దీపావళి కార్నివల్‌ - 46 రోజుల పాటు సంబురాలే సంబురాలు - Carnival In Ramoji Film City

Carnival In Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి వేడుకల్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు సంబురాలు కొనసాగనున్నాయి. భూతల స్వర్గంగా పేరొందిన ఫిల్మ్‌సిటీ ప్రత్యేక వేడుకలకు చేసిన ముస్తాబుతో మిలమిలా మెరిసిపోతోంది. వెలుగు జిలుగులతో పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది. | Read More

ETV Bharat Live Updates - CARNIVAL IN RAMOJI FILM CITY

07:07 AM, 28 Sep 2024 (IST)

త్వరలో మూసీ బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా సర్వే - ఇవాళ్టి నుంచి నిర్వాసిత విద్యార్థుల వివరాల సేకరణ - Musi River Buffer Zone survey

Survey in Musi Buffer Zone : మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం త్వరలోనే బఫర్‌జోన్‌లోని నిర్మాణాలపైనా సర్వే చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నిర్వాసితుల కుటుంబాల్లోని విద్యార్థుల వివరాలు సేకరించబోతున్నారు. వారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల సమీపంలోనే ప్రవేశాలు కల్పిస్తామని సర్కార్‌ వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - MUSI DEMOLITION NEWS

06:52 AM, 28 Sep 2024 (IST)

'కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? - కూల్చివేతల్లో ఎందుకింత దూకుడు' : హైడ్రాపై హైకోర్టు సీరియస్ - tg HC Serious on HYDRA Demolitions

High Court Serious on HYDRA Demolitions : అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. శనివారం నోటీసు ఇచ్చి, ఆదివారం కూల్చేస్తారా? కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? అంటూ ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటని మరోసారి అడిగిన హైకోర్టు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కూల్చివేతలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్‌కు, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - HYDRA DEMOLITION IN AMEENPUR
Last Updated : Sep 28, 2024, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details