Telangana High Court Civil Judge Notification: తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? జీతం ఎంత ? ముఖ్యమైన తేదీలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం...
మొత్తం ఎన్ని ఉద్యోగాలు:తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 150 పోస్టులు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 18, 2024.
- దరఖాస్తులకు చివరి తేదీ - మే 17, 2024.
- హాల్ టికెట్లు డౌన్లోడ్ - 08 జూన్ 2024.
- స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) - 16 జూన్ 2024.
విద్యార్హతలు ఏంటి:నోటిఫికేషన్ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
ఫీజు ఎంత:ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
వేతనం ఎంత చెల్లిస్తారు:నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైతే జీతం నెలకు 77వేల 840 నుంచి 1లక్షా 36వేల 520 రూపాయలు ఉంటుంది.
ఎంపిక విధానం:తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. జాబ్ పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ దశలన్నింటినీ క్లియర్ చేయాలి.
- మొదటిది స్క్రీనింగ్ టెస్ట్: ఇందులో 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సమయం 2 గంటలు. స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు.
- రెండవది మెయిన్స్: స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇది 1:10గా ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ట్రాన్స్లేషన్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లీష్‌లోనే పరీక్ష ఉంటుంది.
- చివరిది వైవా: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారు వైవాకు అర్హత సాధిస్తారు. ఇది 1:3గా ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
- ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి. లింక్ ఇదే.. https://tshc.gov.in/getRecruitDetails
- తర్వాత Link for Submission of Online Application for Recruitment to the Posts of Civil Judge (Junior Division) Notified for the Year 2024 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు వేరే పేజీ ఓపెన్ అవుతుంది.
- తర్వాత మీరు ఇది వరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటే Already Registred? To Login ఆప్షన్‌కు ఎదురుగా Click Here బటన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి.
- ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే New Registration ఎదురుగా ఉన్న Click Here ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత Already Registred? To Login ఆప్షన్‌కు ఎదురుగా Click Here బటన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో అన్ని వివరాలు సరిగా ఎంటర్ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసుకోవాలి.
- తర్వాత ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
- ఫైనల్‌గా మీ అప్లికేషన్‌ను తర్వాత అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ ఇంటర్వ్యూ టిప్స్ మీ కోసమే! - Software Engineering Interview Tips
ఇండియాలోని అత్యంత కఠినమైన పరీక్షలు ఇవే! పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? - TOP 9 Toughest exams in India