తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్​ - విచారణ సోమవారానికి వాయిదా - MLAs Disqualification Petition

BRS MLA's Disqualification Petition Hearing Adjourned : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్​ దాఖలు చేసిన అనర్హత పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

BRS MLA's Disqualification Petition Hearing Adjourned
BRS MLA's Disqualification Petition Hearing Adjourned (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 3:27 PM IST

MLAs Disqualification Petition :భారత రాష్ట్ర సమితి పార్టీ​ నుంచి గెలిచి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఈ ముగ్గురునీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​ శాసన సభ్యులు పాడి కౌశిక్​ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details