Telangana HC Verdict On MLCs Appointments :గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లనుగవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor Quota MLCs) నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
సెల్లార్ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు
HighCourt Dismissed Governor Quota MLCs Appointments : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి తమిళిసై సౌందర రాజన్ అంగీకరించారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయగా, ఆమె ఆమోదం తెలిపారు. అయితే మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు పంపింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళిసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.