తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్​-1 అభ్యర్థులకు అలెర్ట్ - మెయిన్స్​ హాల్​ టికెట్లు ఆ రోజు నుంచే డౌన్​లోడ్ - GROUP 1 MAINS HALL TICKETS DOWNLOAD

ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల - టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో - ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు

Telangana Group 1 Mains Hall Tickets
Telangana Group 1 Mains Hall Tickets (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 3:59 PM IST

Updated : Oct 9, 2024, 6:31 PM IST

Telangana Group 1 Mains Hall Tickets : గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్​లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రం గేట్లు మూసి వేస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అధికారులు పంపించరు.

ఈ ఏడాది జూన్‌ 9న నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సుమారు 3లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.

ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల (ETV Bharat)

అభ్యర్థులకు టీజీపీఎస్సీ ముఖ్య సూచనలు :

  • అభ్యర్థులు తమ హాల్​ టికెట్లు, అన్ని పరీక్షల క్వశ్చన్​ పేపర్లు సెక్షన్​ పూర్తయ్యేంత వరకు భద్రంగా ఉంచుకోవాలి.
  • ఏ అభ్యర్థి పరీక్షా హాల్​లోకి గడియారాలు, క్యాలికేటర్లు, స్లిప్​లు, ఎలాంటి కాగితాలు తీసుకురాకూడదు.
  • ప్రతీ పరీక్షా రూమ్​లో వాల్​ క్లాక్​లు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన.
  • హాల్​ టికెట్లు డౌన్​లోడ్​ చేసుకొనే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే టీజీపీఎస్సీ టెక్నికల్​ హెల్ప్​ డెస్క్​ నంబర్లు 040-23542185, 040-23542187కు కాల్​ చేయవచ్చు.( ఆఫీసు వేళల్లో మాత్రమే కాల్స్​ స్వీకరించబడతాయి)
  • ఫోన్​ ద్వారా కాకుంటే Helpdesk@tspsc.gov.in కు మెయిల్ చేయవచ్చని టీజీపీఎస్సీ ప్రకటనలో సూచించింది.

పరీక్ష సమయంలో మార్పు : అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగే టీజీపీఎస్సీ గ్రూప్​ -1 మెయిన్స్​ పరీక్ష సమయంలో మార్పు జరిగింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించాలి. కానీ మారిన సమయం ప్రకారం చూస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

'గ్రూప్​-1 పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా - కొత్త నోటిఫికేషన్ చెల్లదు' - PETITIONS ON TG GROUP1 NOTIFICATION

గ్రూప్ - 1 అభ్యర్థులకు అలర్ట్​ - మెయిన్స్ పరీక్షల సమయాల్లో మార్పులు - Group 1 Main Exam Time Table

Last Updated : Oct 9, 2024, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details