Telangana Govt Set up Food Safety Committees in Gurukuls: గురుకులాల్లో వరుస ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఫుడ్‌సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారులను టాస్క్ఫోర్స్లో సభ్యులుగా నియమించింది. ఆహారం కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసి, కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతీ విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు సిబ్బందితో ఫుడ్‌సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ కమిటీ వంటగదిలో పరిశుభ్రత పరిశీలించిన తర్వాతే వంట చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వంట పూర్తయ్యాక ఫుడ్ సేఫ్టీ అధికారులు తిని పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పర్యవేక్షకులు కూడా పిల్లలకు భోజనం పెట్టే ముందు, వంటగదిని తనిఖీ చేసి, భోజనం రుచి చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాపారంలో నష్టం - రాత్రికి రాత్రి కోటేశ్వరుడు కావాలని ప్లాన్ - చివరికి ఏమైందంటే!