APSBCL Website Shows MD Name As Vasudevareddy : ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీ ఎవరని అడిగితే అవినీతి కేసులో ఇరుకున్న వాసుదేవరెడ్డే అంటూ ఆ సంస్థ చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీగా నిషాంత్ కుమార్ వ్యవహరిస్తుంటే వెబ్ సైట్ మాత్రం ఇంకా వైఎస్సార్సీపీతో అంటకాగిన వాసుదేవరెడ్డినే తమకు అధిపతి అని అంటోంది. ఆ శాఖ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ వివరాల్లో వాసుదేవరెడ్డినే సంప్రదించాలని చూపిస్తోంది. ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ ఎండీ హోదాలో అవినీతి, అక్రమాలకు పాల్పడి సీఐడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తినే ఇంకా అధిపతిగా ఏపీబీసీఎల్ (APBCL) పేర్కొనటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి బెవరెజెస్ కార్పొరేషన్ ప్రధాన వెబ్‌సైట్‌లో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోలు, మరికొన్ని వివరాలు మాత్రమే అప్‌డేట్ చేశారు. మిగతా వివరాలను మార్పు చేయలేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని ప్రజలకు సేవలు అందించాలని ప్రత్యేకించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాసనలు వదిలించుకోవాలని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం కొనుగోలు ఆర్డర్లలో కీలక ఆధారాలు - అంతిమ లబ్ధి ఎవరికంటే? - CID Investigating Liquor Scam