Gram Panchayats Merged in Municipalities within ORR : ఓఆర్ఆర్ పరిధి లోపల, ఓఆర్ఆర్ను అనుకొని ఉన్న గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర సర్కారు, మొత్తం 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం వల్ల పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 పురపాలక చట్టానికి సవరణ చేస్తూ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్న 45 పంచాయతీలోపాటు సమీపంలోని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మంత్రివర్గ ఉప సంఘానికి వచ్చిన వినతుల మేరకు ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న మరో 6 పంచాయతీలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలు, శంషాబాద్ మున్సిపాలిటీల్లో బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమి గూడ గ్రామాలు విలీనం కాగా నార్సింగి మున్సిపాలిటీల్లో మీర్జాగూడ గ్రామ పంచాయతీ విలీనమైంది.
తక్షణమే అమల్లోకి :ఇక తుక్కుగూడ మున్సిపాలిటీల్లో హర్షగూడ గ్రామ పంచాయతీ విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మేడ్చల్ మున్సిపాలిటీల్లో పూడూరు, రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి. నాగారం మున్సిపాలిటీల్లో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార పంచాయతీలు, పోచారం మున్సిపాలిటీల్లో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివాని సింగారం, చౌదరిగూడలు విలీనం చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడల విలీనమమయ్యాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలను విలీనం చేశారు. తూంకుంట మున్సిపాలిటీల్లో బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు కలిసిపోయాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో కర్దానూర్, ముత్తంగి, పోచారం, పాటీ, ఘన్పూర్ పంచాయతీలను కలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీల్లో ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్ గూడ, దయారా, కిష్టారెడ్డిపేట, సుల్తాన్ పూర్ పంచాయతీల విలీనం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గెజిట్‌లో పేర్కొంది.
జీహెచ్ఎంసీ విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం- మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు