Telangana Government on Krishna Water :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో ఉన్న 1050 టీఎంసీల్లో తమకు వాటాగా 789 టీఎంసీలను కేటాయించాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ట్రైబ్యునల్‌కు సమర్పించిన స్టేట్మెంట్ ఆఫ్ కేసులో వివరాలను పొందుపరచి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తై వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తంగా 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది.
కృష్ణా జలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు 238 టీఎంసీలు కావాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల్లో 291 టీఎంసీల మిగులుకు అవకాశం ఉందని ఆ జలాలను తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. అందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
సాగర్‌లోని 14 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కేఆర్‌ఎంబీ ప్రతిపాదనలు - KRMB Meeting Over Water Crisis
బచావత్ కేటాయింపుల్లో తెలంగాణ వాటా 555 టీఎంసీలు : బచావత్ ట్రైబ్యునల్ 75 శాతం నీటి లభ్యత కింద కేటాయించిన 811 టీఎంసీలలో తమకు దక్కాల్సింది 555 టీఎంసీల కంటే తక్కువ కాదని, ఈ మేరకు కేటాయించాలని తెలంగాణ కోరింది. కృష్ణా ట్రైబ్యునల్-2 అదనంగా 65 శాతం నీటి లభ్యత కింద చేసిన 43 టీఎంసీల కేటాయింపు మొత్తాన్ని మా వాటాగా ఇవ్వాలని కోరింది. సరాసరి నీటి లభ్యత కింద కేటాయించిన 145 టీఎంసీలలో 120 టీఎంసీలకు తక్కువ కాకుండా ఇవ్వాలని కోరింది. గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు మళ్లించే నీటిలో 45 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలని తెలిపింది. సుప్రీంకోర్టులో ఉన్న సివిల్ అప్పీల్ 5178 కేసులో అదనంగా వచ్చే మొత్తం నీటిని తెలంగాణకు కేటాయించాలి. కృష్ణా బేసిన్‌కు బయట ఉన్న నాగార్జునసాగర్, కేసీ కాలువ, తుంగభద్ర హెచ్చెల్సీ, గుంటూరు ఛానల్ కింద ఆయకట్టును ఒక ఆరుతడి పంటకు మాత్రమే పరిమితం చేయాలి.
1976 తర్వాత కృష్ణా బేసిన్‌కు బయట 75 శాతం నీటి లభ్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని మళ్లించకుండా చూడాలని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకు 2,578 టీఎంసీలకు మించి వచ్చే మిగులు నీటిని పూర్తిగా వినియోగించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలని పేర్కొన్నారు. బేసిన్ అవసరాలకు, బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు తెలంగాణకు చేసిన కేటాయింపులు కచ్చితంగా వచ్చేలా చూడాలి. రాష్ట్రంపై ప్రభావం చూపే ఏ ప్రాజెక్టులనూ ఆంధ్రప్రదేశ్ చేపట్టకుండా ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
నాగార్జునసాగర్ నుంచి నీరు తీసుకోవడం ఇక ఆపేయండి - ఏపీకి కేఆర్‌ఎంబీ లేఖ - KRMB Orders AP to Stop Sagar Water
ఏపీ, తెలంగాణకు 14 టీఎంసీల నీటి విడుదల - కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు - KRMB Orders Release Of Sagar Water