Telangana Govt Assigned 169 Personnel To HYDRA : హైదరాబాద్ మహానగరంలో హైడ్రా బలోపేతం కోసం ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 33 విభాగాల్లో 169 మంది సిబ్బందిని నియమిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌తోపాటు ఇద్దరు ఎస్పీ ర్యాంకు హోదా ఉన్న అసిస్టెంట్ కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్సైలతోపాటు 60 మంది కానిస్టేబుళ్లను నియమించారు. అలాగే 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లును హైడ్రా కోసం కేటాయించారు.
ముగ్గురు రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, సమాచారానికి సంబంధించి ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, అనలైటికల్ ఆఫీసరు, డిప్యూటీ అనలైటికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అనలైటికల్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్, సిటీ ప్లానర్, ముగ్గురు డిప్యూటీ సిటీ ప్లానర్, నీటిపారుదలకు సంబంధించి ఒక ఈఈ, ముగ్గురు డీఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి ఇద్దరు డీఈలు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, ఆర్థిక శాఖ నుంచి ఒక డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు సర్వేయర్లను ప్రభుత్వం హైడ్రా కోసం నియమించింది.