Cyber Criminals Eye On Loan Waivers :కాదేదీ సైబర్ నేరగాళ్లకు అనర్హం అన్నట్లుగా తయారయ్యింది వారి పరిస్థితి. ప్రజలను మోసగించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా సైబర్ కేటుగాళ్లు వదులుకోవడం లేదు. మారుతున్న పరిణామాలు ఆసరాగా చేసుకుని అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి ప్రజల సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ సొమ్ము అసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
బ్యాంకులోగోతే ఉండే నంబర్ల నుంచి :తాజాగాప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆ పథకం లబ్ధిదారులపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్ నంబర్ల నుంచి మోసపూరిత ఫైల్స్, లింక్‌లను పంపిస్తున్నారు. పొరపాటున అటువంటి లింక్‌లపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. అలా చేయడం ద్వారా ఫోన్ హ్యాకవ్వడం, లేదా ఎనీడెస్క్ యాప్ వంటివి మీ సెల్ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి.
ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో రెస్టారెంట్లు, హోటళ్లకు రేటింగ్ ఇస్తే డబ్బులు - నిజమని నమ్మి రివ్యూ ఇచ్చారో అంతే! - Hotel Review Cyber Crime
వెంటనే ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు వారి ఆధీనంలోకి తీసుకుని మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో కొందరికి వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లింకులతో నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అలాంటి లింక్‌లపై క్లిక్ చేశారో అంతే సంగతులు :రుణమాఫీ అర్హలకు సంబంధించిన జాబితాలను మండలాలు, గ్రామాల వారీగా స్థానిక అధికారులు, అధికారపార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో విడుదల చేస్తున్నారు. నేరగాళ్లు అలాంటి జాబితాలు, బ్యాంకుల లోగోలుండే వాట్సాప్ అకౌంట్ల నుంచి నేరపూరిత వెబ్‌లింక్‌లు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. దీనిద్వారా ఫోన్ కాంటాక్ట్ లిస్టలోని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు డబ్బు అవసరముందని మేసేజ్‌లు పంపించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
ప్రజల కష్టాన్ని క్షణాల్లో కాజేస్తున్న సైబర్ కేటుగాళ్లు - రాష్ట్రంలో రోజుకు రూ.5 - రూ.6 కోట్లు మాయం - Cybercrimes and economic offences rise in TG