తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ఆరోజే మేనిఫెస్టో ప్రకటన - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Telangana Congress Public Meeting In Tukkuguda : కాంగ్రెస్‌ జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు హైదరాబాద్‌ తుక్కుగూడ సభ వేదికగా కానుంది. గత ఏడాది సెప్టెంబరు 17న జరిగిన సభ కంటే వచ్చే నెల 6న నిర్వహించే జన జాతర సభకు భారీగా జనసమీకరణ చేయాలని పీసీసీ నిర్ణయించింది. బీఆర్ఎస్​కు చెందిన కీలక నేతలు సైతం తుక్కుగూడ సభ వేదికగానే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి మాత్రం ఇవాళే హస్తం గూటికి చేరనున్నారు.

Telangana Lok Sabha Elections 2024
Telangana Congress Public Meeting In Tukkuguda

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 8:07 AM IST

ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ఆరోజే పార్టీలో భారీగా చేరికలు

Telangana Congress Public Meeting In Tukkuguda : లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ హైదరాబాద్‌ వేదికగా ప్రకటించనుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనను రోల్‌మోడల్‌గా భావిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక్కడి నుంచే ఐదు గ్యారంటీలను వెల్లడించాలని నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడలోని రాష్ట్ర కాంగ్రెస్‌ సభ నిర్వహించిన రాజీవ్ గాంధీ ప్రాంగణాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. ఏప్రిల్‌ 6న జనజాతర పేరుతో నిర్వహించే సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.

Telangana Lok Sabha Elections 2024 :బీఆర్ఎస్​కు చెందిన కీలక నేతల చేరికకు సైతం జనజాతర సభ వేదిక కానుంది. సీనియర్‌ నేత K. కేశవరావు ఆ రోజే కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ సాధనకే నాడు టీఆర్ఎస్​లోకి వెళ్లానని రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నానని ఆయన తెలిపారు. అవసరమైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కే.కే వ్యాఖ్యానించారు.

నాలుగు స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల - నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - LOK Sabha Elections 2024

అటు బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యతోనూ సంప్రదింపులు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోవడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. వచ్చేనెల 6న జరిగే జన జాతర సభ వేదికగా తండ్రికుమార్తె అధికార పార్టీలో చేరతారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్‌, KK కుమార్తె గద్వాల విజయలక్ష్మీ మాత్రం ఇవాళే కాంగ్రెస్‌ కండువగా కప్పుకోనున్నారు.

Congress Manifesto For Lok Sabha Election 2024 :రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మీ పథకం మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికీ ఆర్థిక తోడ్పడుతున్నాయని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీ వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. వాళ్లు కాంగ్రెస్‌కు దగ్గరైతే ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

"తెలంగాణను దేశవ్యాప్తంగా మోడల్​గా తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసాం. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించేందుకు హైదరాబాద్‌ తుక్కుగూడ రాజీవ్‌ గాంధీ ప్రాంగణం జనజాతర సభ వేదికగా నిలువనుంది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ తెలంగాణలో జరుగుతున్న అబివృద్ది, అమలు చేసిన పాంచ్‌ న్యాయ్‌ గ్యారంటీలను వివరిస్తారు."- భట్టి , ఉపముఖ్యమంత్రి

ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై తెగని పంచాయితీ - ఏకాభిప్రాయం రాకపోతే బరిలోకి ప్రియాంక గాంధీ! - Khammam Congress MP Candidate Issue

ఎన్నికల ప్రచారం దృష్టి సారించిన కాంగ్రెస్ - నేడు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details