Telangana Cabinet Meeting Today :లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇవాళ రాష్ట్రమంత్రి వర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం(Minister Ponnam Prabhakar), శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం సహా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై సర్కారు విచారణకు సిద్ధమైంది.
కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ :ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ కమిటీ వేసిన కేబినెట్, 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచించింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై(Yadadri Power Project) విచారణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.
కలల కేబినెట్ - 'మంత్రి' కోసం నిజామాబాద్ నేతల ఎదురుచూపులు, ఆశ నెరవేరేనా?
"విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయి విచారణ కోసం నియమించాం. ఈమేరకు 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేశాం. అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డిని ఛైర్మన్‌గా నియమించాం. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఆనాడు ఛత్తీస్‌గఢ్‌లో 1000 మెగా వాట్ల పవర్‌ను నామినేట్ సిస్టమ్‌తో కొని, దళారులకు ధారాదత్తం చేశారో దానిపై విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం."-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి