CM Revanth Reddy Cabinet Meeting Decisions :సచివాలయంలో సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రిమండలి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రతి ఎకరానికీ ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏటా 10వేల ఆర్థిక సాయం చేస్తోంది.
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ (ETV Bharat) పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలు :భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఏటా రూ.12 వేలు సాయం అందిస్తారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ వివరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు సంబంధించి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగూరు కెనాల్‌కు రాజనరసింహ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
"రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయించాం. ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా" నామకరణం చేస్తున్నాం"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Reddy On New Ration Cards :రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.
అలాంటి వారికి రైతు భరోసా వర్తించదు : వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నేడు కేబినెట్ భేటీ - రైతు భరోసా, సన్న బియ్యం పంపిణీపై సాయంత్రానికి క్లారిటీ