తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

Telangana Cabinet Approved Budget 2024 : రాష్ట్ర బడ్జెట్​కు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉదయం అసెంబ్లీ కమిటీహాల్‌లో మంత్రివర్గం పద్దు ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి చర్చించింది. మరోవైపు రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Telangana Cabinet Approved Budget 2024
Telangana Cabinet Approved Budget 2024

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 11:50 AM IST

Updated : Feb 10, 2024, 12:34 PM IST

Telangana Cabinet Approved Budget 2024 : రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉభయసభల్లో 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మండలిలో పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం అసెంబ్లీ కమిటీహాల్‌లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్​కు ఆమోదం తెలిపారు. పద్దు ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి చర్చించారు.

కృష్ణా జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్​ఎస్​ - 'ప్రాజెక్టుల'పై శాసనసభలో మాటల యుద్ధం

Telangana Cabinet Meeting Today :దీంతో పాటు ఇతర అంశాలు కూడా కేబినేట్ భేటీలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్​కు ధీటుగా సమాధానం చెప్పడం, నల్గొండలో ఆ పార్టీ సభ తలపెట్టిన నేపథ్యంలో అధికార పక్షంగా ఎదుర్కోవడం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ ఆనకట్టపై (Medigadda Barrage) విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం నివేదిక, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్​లో అన్ని అంశాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే ఆదాయంపైనా ప్రసంగంలో ఉంటాయని భట్టి తెలిపారు.

Telangana Budget Sessions 2024 :మరోవైపు శాసనసభ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ప్రజాకర్షకంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఆరు హామీలకు పద్దులో ప్రాధాన్యం దక్కనుంది. వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీల కోసం కూడా కేటాయింపులు చేయనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ సంవత్సరానికి సరిపడా ప్రతిపాదనలు ఉండనున్నాయి.

Telangana Vote on Account Budget 2024 :అయితే పూర్తి పద్దు తరహాలో ఇందులో సమగ్ర వివరాలు ఉండవు. ఆయా శాఖల బడ్జెట్​లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఉండవు. దీంతో పద్దులపై చర్చకు అవకాశం ఉండదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ సమయంలో అన్ని అంశాలను మరింత సమగ్రంగా బేరీజు వేసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రూ.2.95 లక్షల కోట్లతో నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​! - ఆరు గ్యారంటీలకే పెద్దపీట

తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Feb 10, 2024, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details