తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు - అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపత్రాలు - Vote on Account Budget TS 2024

Telangana Budget Sessions 2024-25 : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నీటి పారుదల అంశాలపై చర్చతో సమావేశాలు వేడెక్కనున్నాయి.

Telangana Budget Sessions
Telangana Budget Sessions

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 7:01 AM IST

Updated : Feb 8, 2024, 7:07 AM IST

నేటి నుంచి ప్రారంభంకానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Sessions 2024-25 : రెండు నెలలలోపే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఇవాళ ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 గంటలకు శాసనసభ సభా మందిరంలో సంయుక్త భేటీ జరగనుంది.

Telangana Budget 2024-25 : శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 9న రాష్ట్ర మూడో శాసనసభ మొదటిసారి కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగించారు. తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రెండు నెలలలోపే మరోమారు గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి.

Telangana Budget Sessions 2024 Today : ఉభయసభలు వాయిదా పడిన అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశం అవుతాయి. బడ్జెట్ సమావేశాల పని దినాలు, ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్​లో రేపు చర్చ, సమాధానం ఉండనున్నాయి.

టార్గెట్ లక్షద్వీప్- బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్- వారికీ ఆయుష్మాన్​ భారత్​- బడ్జెట్​లో కీలక ప్రకటనలివే!

Vote on Account Budget Telangana 2024 : పదో తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో తెలంగాణలోనూ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీటి పారుదల అంశాలతో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. నీటి పారుదల రంగానికి సంబంధించి ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే ప్రకటించారు.

మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఇద్దరు ఈఎన్సీలను తెలంగాణ సర్కార్ ఇప్పటికే తప్పించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు ( Kaleswaram Project) సంబంధించిన అంశాలపై ఆడిటింగ్ నిర్వహించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని సర్కార్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

మధ్యతరగతికి గూడు- యథాతథంగా పన్నులు- తాయిలాలు లేకుండా మధ్యంతర బడ్జెట్

వీటితోపాటు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్ లెట్లను అప్పగించే విషయమై రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని అంశాలపై శాసనసభ వేదికగా పూర్తిస్థాయిలో చర్చిద్దామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష గులాబీ పార్టీ సైతం చర్చకు సిద్ధమని తెలిపింది.

కృష్ణా జలాల పరిరక్షణ పేరిట 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభకు కూడా గులాబీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో నీటిపారుదలపై చర్చతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. మరో రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు వీటితోపాటు మరికొన్ని ఇతర బిల్లులు, అంశాలు కూడా శాసనసభ, మండలి ముందుకు రానున్నాయి.

నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

Last Updated : Feb 8, 2024, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details