6:22PM
రుణాలు తీసుకోవడంలో దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాం : ప్రశాంత్‌రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో జాతీయ వృద్ధిరేటు కంటే 2.4 శాతం అధిక వృద్ధి రేటు నమోదైందని మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2014లో జీఎస్‌డీపీ రూ.5.05 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.14.49 లక్షల కోట్లు ఉందన్నారు. ఈసారి పెరిగితే జీఎస్‌డీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుతుంది. జీడీపీలో రాష్ట్ర భాగస్వామ్యం 2014లో 4 శాతం కాగా ఇప్పుడు 4.9 శాతంగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 1.24 లక్షలు.. ప్రస్తుతం రూ.3.43 లక్షలు ఉంది.
రాష్ట్ర తలసరి ఆదాయంలో మూడో స్థానంలో ఉన్నాం. రాష్ట్ర ఖర్చులో 80 శాతం మన సొంత ఆదాయమే ఖర్చు పెడుతున్నాం. జీఎస్‌డీపీలో అప్పులు 28.2 శాతంగా ఉన్నాయి. రుణాలు తీసుకోవడంలో దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాం.గత ప్రభుత్వం రైతులకు రూ.1.85 లక్షల కోట్లు సాయం అందించింది.రాష్ట్రంలో 2.68 కోట్ల ఎకరాలకు పంట విస్తీర్ణం పెరిగింది
6:17PM
ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
6:14PM
పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించడం సరికాదు : ప్రశాంత్‌రెడ్డి
పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ పెట్టారనడం మంచి ప్రయత్నమే కానీ గతంతో పోల్చుకుంటే రూ.51 వేల కోట్లు అధికంగా బడ్జెట్ పెట్టారు. ట్యాక్స్ రెవెన్యూలో రూ.20 వేల కోట్లు అధికంగా చూపారు. గతంలో ట్యాక్స్ రెవెన్యూ రూ.1.18 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు రూ.1.38 లక్షల కోట్లుగా పెట్టారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా పెట్టారనేది నా అభిప్రాయం.
ట్యాక్స్ రెవెన్యూ 10.6 శాతం నుంచి ఏకంగా 16.9 శాతానికి పెంచారు.ట్యాక్స్ రెవెన్యూ అసాధారణంగా పెంచారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో రూ.7 వేల కోట్లు పెంచారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను 5.8 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ఓపెన్ మార్కెట్ రుణాలను అసాధారణంగా పెంచారు. రూ.19 వేల కోట్లు ఎక్కువగా అప్పులు తెస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపిందని ఆరోపిస్తున్నారు.
అప్పుల భారం అంటూనే రూ.20 వేల కోట్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ అప్పులతో దివాళా తీసి ఉంటే మీకు అప్పులు దొరికేది కాదు. గత అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. రూ.59 వేల కోట్ల అప్పుల్లో తీర్చే అసలు, వడ్డీ ఎంతో చెప్పాలి. ద్రవ్యలోటు రూ.53 వేల కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు 3.2 శాతం చాలా ఎక్కువగా చూపారు
6:05 PM
కేంద్రం పథకాలు మీ పేర్లు పెట్టడం సరికాదు: మహేశ్వర్
రాష్ట్రాలపై పడి కేంద్రం పన్నుల రూపంలో దోచుకుంటుందనడం సరికాదని మహేశ్వర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన పన్నుల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతారన్న ఆయనపీఎం ఆవాస్ యోజనకు ఇందిరమ్మ ఇళ్లుగా పేరు పెట్టడం సరికాదన్నారు.
బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు చూపుతున్నారు : అక్బరుద్దీన్
పథకాలకు సంబంధించి కేటాయింపుల వివరాలు ఇవ్వలేదని అక్బరుద్ధీన్ మండిపడ్డారు. బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో తప్పుడు లెక్కలను సరిచేయాలని వారు కోరారు.
ఆరు గ్యారంటీలకు ఓ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు? : కడియం శ్రీహరి
ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53196 కోట్లు కేటాయించారని కడియం శ్రీహరి అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ పథకానికి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూపారన్నారు.
నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తాం : భట్టి విక్రమార్క
కేంద్ర పథకాలకు సంబంధించి ప్రధాని ఫొటోలు పెడతామని భట్టి విక్రమార్క తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కచ్చితంగా గౌరవిస్తామన్నారు. పన్నుల మేరకు రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తామని తెలిపారు.
4:45 PM
బడ్జెట్ ఫలితాలు చివరి వ్యక్తి వరకు అందాలి: కూనంనేని
ఆదాయ వనరులు పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సీపీఐ కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్‌లో ఐదారు శాతం తేడా ఉంటే ప్రజలు కూడా నమ్ముతారని తెలిపారు. బడ్జెట్ ఫలితాలు చివరి వ్యక్తి వరకు అందాలని కోరారు.
4:39 PM
పథకాల నిధుల వివరాల సమర్పణలో మంత్రి విఫలమయ్యారు: అక్బరుద్దీన్
ఆరు గ్యారంటీల అమలుకు రూ.53 వేల కోట్లు కేటాయించారని, పథకాలకు నిధుల వివరాల సమర్పణలో మంత్రి విఫలమయ్యారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. పథకాలు, డిమాండ్ల మేరకు నిధుల కేటాయింపులు జరగలేదని తెలిపారు. బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ పరిమాణానికి నిధుల కేటాయింపులో తేడా ఉందన్నారు. ఈసారి వడ్డీల చెల్లింపులకు రూ.22,750 కోట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్-జులై కాలానికి రూ.17,742 కోట్ల రుణాలపై స్పష్టత ఇవ్వాలి. ధరణి గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదుప్రస్తుత ప్రభుత్వం ధరణి కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి. పాతనగరంలో మెట్రో పనులకు శంకుస్థాపన చేయాలని కోరుతున్నా. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు పనులకు శంకుస్థాపన చేయాలి. ఫీజులు చెల్లించలేదని కళాశాలల్లో విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వట్లేదు. కళాశాలలకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే ధ్రువపత్రాలు ఇస్తారు. ధ్రువపత్రాలు ఇవ్వకపోతే విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితి మైనార్టీ విద్యార్థులకు సంబంధించి 2018-19 నుంచి బకాయిలు ఉన్నాయి.మైనార్టీ విద్యార్థులకు సంబంధించి రూ.323 కోట్లు బకాయిలు ఉన్నాయి అని అక్బరుద్దీన్ అన్నారు.
విద్యార్థుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తే ధ్రువపత్రాలు ఇస్తారని, విదేశీ ఉపకారవేతనాలకు సంబంధించి రూ.64 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు.
4:37 PM
పీఎం ఆవాస్ యోజన నిధులు వాడుకుంటూ ఇందిరమ్మ ఇళ్లు అనడం సరికాదు : మహేశ్వర్ రెడ్డి
మహాలక్ష్మి పథకానికి రూ.14 వేల కోట్లు కావాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. డబ్బులు కేటాయించకుండా అన్ని హామీలు నెరవేరుస్తామన్నారని గుర్తు చేశారు. సాగుకు రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.19700 కోట్లు కేటాయించారని, పీఎం ఆవాస్ యోజన నిధులు వాడుకుంటూ ఇందిరమ్మ ఇళ్లు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పీఎం ఆవాస్ యోజన ఇళ్లకు వాజ్‌పేయీ పేరు, బొమ్మ పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఆర్థికసాయంపై ప్రస్తావనే లేదన్నారు. చేయూత కింద 44 లక్షల మందికి రూ.21 వేల కోట్లపై స్పష్టత లేదని మండిపడ్డారు.
4:08 PM
శాసనసభలో మంత్రి వ్యాఖ్యలు సరికాదు: కడియం
శాసనసభలో మంత్రి వ్యాఖ్యలు సరికాదని కడియం శ్రీహరి మండిపడ్డారు. తాను, రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమంలో ఒకే పాఠశాలలో చదివామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని, సభ్యులతో జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాని అన్నారు. రేవంత్‌కు మా పార్టీ నుంచి ఏరకమైన ఇబ్బంది ఉండదని, తన పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలి చెప్పారు.
4:04 PM
బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు ఫ్రస్టేషన్ కాదు : కోమటిరెడ్డి
గతంలో మీరు మోసగించినట్లు మేమూ మోసగిస్తామనడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీది ప్రతిపక్షం కాదు ఫ్రస్టేషన్ పక్షమని ఎద్దేవా చేశారు. నల్గొండలో హోంగార్డు చనిపోతే బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక మొదటి సీఎం దళితుడే అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీ ఎక్కడ పోయిందని అడిగారు.
4:02 PM
ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది: మంత్రి పొన్నం
కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యోగాలకు సంబంధించి న్యాయ వివాదాలు పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కొత్తగా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ను నియమించామన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు
4:00 PM
2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి :కడియం
కొత్త ప్రభుత్వం తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారని కడియం మండిపడ్డారు. గత ప్రభుత్వం నాటి నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
3:58 PM
యువత జాబ్ క్యాలండర్ కోసం ఎదురు చూస్తున్నారు: కడియం శ్రీహరి
గతేడాది ద్రవ్యలోటు రూ.33 వేల కోట్లుగా ఉందని కడియం శ్రీహరి అన్నారు. ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు భారీగా కనబడుతోందని ప్రశ్నించారు. 2లక్షల ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేయాలి అనుకుంటున్నారో తెలియాలి అని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ యువత ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలండర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
3:53 PM
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభ్యులు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నానని భట్టి అన్నారు.
3:48 PM
కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు కృషి చేస్తాం: భట్టి
పాతనగరంలో మెట్రో పనులపై సీఎం ఇప్పటికే సమీక్షించారని తెలిపారు. మెట్రో పనులకు సంబంధించి ఇప్పటికే సీఎం ఆదేశించారన్నారు. కేంద్ర నిధులు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
3:46 PM
సాంఘిక సంక్షేమ కోసం బడ్జెట్‌లో రూ.5815 కోట్లు
గిరిజన సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2800 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.40 వేల కోట్లు
3:41 PM
'ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం'
ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు
రైతు భరోసా కోసం బడ్జెట్‌లో రూ.15,075 కోట్లు