తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండంకెల పార్లమెంట్ సీట్లే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ రథయాత్రకు సన్నాహం - BJP Rath Yatra in Telangana

Telangana BJP Yatra For Parliament Elections : పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యథిక సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ నిత్యం ప్రజల్లో ఉండేలా రథయాత్రలు చేపట్టాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఫిబ్రవరి 10 నుంచి రథయాత్రలకు శ్రీకారం చుట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఐదు పార్లమెంట్‌ క్లస్టర్స్‌లో పది రోజుల పాటు సాగే యాత్రలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రులు, జాతీయ నేతలను రప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు, గత బీఆర్ఎస్ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు అంశాలపై రథయాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యాత్రలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ ఖరారైనట్లు తెలుస్తోంది.

BJP Targets on Lok Sabha Seats
Telangana BJP Yatra For Parliament Elections

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 9:31 PM IST

Telangana BJP Yatra For Parliament Elections :తెలంగాణలోని 17 పార్లమెంట్‌ సీట్లలో కనీసం పది సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ఫిబ్రవరి 28న వెలువడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. షెడ్యూల్‌కు ముందే రథయాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంది.

BJP Divided 17 Lok Sabha Seats Into 5 Clusters : ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ఐదు క్లస్టర్లుగాకమల దళంవిభజించుకుంది. ఆదిలాబాద్‌, నిజామబాద్‌, పెద్దపల్లి ఒక క్లస్టర్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, కరీంనగర్‌ పార్లమెంట్ స్థానాలు కలిపి మరొక్క క్లస్టర్‌గా విభజించి పనిచేస్తోంది. మహబూబ్‌ నగర్‌, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ స్థానాలకు కలిపి ఒక క్లస్టర్. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, భువనగిరి లోక్‌సభ స్థానాలతో మరొక్క క్లస్టర్‌ను ఏర్పాటు చేసుకుంది. వరంగల్‌, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలతో ఇంకో క్లస్టర్లను ఏర్పాటు చేసింది.

లోక్​సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'

ఈ ఐదు క్లస్టర్లలో ఫిబ్రవరి 10 నుంచి యాత్రలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే యాత్రలకు సంబంధించిన సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్రల రూట్‌ మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐదు పార్లమెంట్‌ క్లస్టర్స్‌లో యాత్రలు జరగనున్నాయి. ఒక్కో యాత్ర 20 అసెంబ్లీ నియోజకవర్గాలను(Assembly Constituencies) కవర్ చేసేలా రూట్ మ్యాప్‌ను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. ఒక్కో యాత్ర రోజుకు రెండు అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్‌ చేస్తూ సాగనుంది.

BJP Targets on Lok Sabha Seats :తొలి రోజు యాత్రలను కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ముఖ్య అతిధులుగాహాజరై ప్రారంభించనున్నట్లు కాషాయవర్గాలు చెబుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు కార్నర్‌ మీటింగ్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మీటింగ్స్‌కు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేలా కార్యచరణ రూపొందిస్తోంది.

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం - లోక్​సభ ఎన్నికల వేళ జిల్లాలకు కొత్త అధ్యక్షులు

ఈ యాత్రలకు ఒక్కో రోజు ఒక ముఖ్య నాయకుడు నాయకత్వం వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా పది రోజుల పాటు యాత్రలకు గానూ ఒక ముఖ్య నాయకుడు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాయి. ఇప్పటికే రథాలు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్నర్స్‌ మీటింగ్స్‌కు కేంద్రమంత్రులను, జాతీయ నాయకులను(National Leaders) అవసరాలకు అనుగుణంగా రప్పించాలని భావిస్తోంది.

BJP Rath Yatra in Telangana :యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు సమాయత్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు కేంద్రాన్ని సీబీఐ విచారించాలని కోరడంలేదని నిలదీయాలని యోచిస్తోంది.

పది రోజుల పాటు యాత్రలతో రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలతో మమేకంకావడం వల్ల బీజేపీకు(Bharatiya Janata Party) మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రథయాత్రలు చేపట్టాలని అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాల వల్ల వాయిదా పడినపరిస్థితి నెలకొంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కూడా రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతుంది. ఈసారైనా రథయాత్రలు జరగుతాయా లేఖ వాయిదాపడుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.

వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి

పాలమూరు బీజేపీ లోక్​సభ సీటు ఎవరిది? - రేసులో ఆ ముగ్గురు కీలక నేతలు

ABOUT THE AUTHOR

...view details