Telangana Auto Drivers Financial Assistance : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తున్నారు. రెండో రోజు సమావేశాల్లో శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సమర్థిస్తూనే, దానివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర సర్కార్ ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
Financial Assistance To Telangana Auto Drivers :ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లసంక్షేమం తమ బాధ్యత అని చెప్పారు. వారికి ఏటా రూ.12 వేలు సాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. బడ్జెట్‌లో వారి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరుపుతామని వెల్లడించారు.
'రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వవద్దని రాహుల్ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. క్రానీ క్యాపిటల్‌ను ప్రోత్సహించే ఆలోచనే మాకు లేదు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వండి తీసుకుంటాం. రాజకీయాలువదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడదాం' అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం