Telangana Athlete Deepthi Jeevanji Wins Bronze Medal in Paralympics : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల్లో ఓరుగల్లు క్రీడాకారిణి సత్తా చాటింది. పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించారు. మంగళవారం రాత్రి పారిస్‌లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని ముద్దాడింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
మేధోపరమైన బలహీనత ఉన్నప్పటికీ : జీవాంజి దీప్తికి పుట్టుకతోనే మానసిక వైకల్యం. మరోవైపు పేదరికం. ఎన్నో అవమానాలు. కానీ తనకు వచ్చిన పరుగునే నమ్ముకుని ముందుకెళ్లింది. దీంతో ఇప్పుడామె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అలా పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రీడల్లో మహిళల టీ20 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతోంది.
Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!