ముగిసిన తెలంగాణ శాసనసభ సమావేశాలు - సభ నిరవధిక వాయిదా Telangana Assembly Sessions 2024 End :నేటితో శాసనసభ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జరిగాయని స్పీకర్ తెలిపారు. ఈ ఎనిమిది రోజులు అసెంబ్లీ 45 గంటల 32 నిమిషాలు జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు.
59 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని స్పీకర్ చెప్పారు. జీరో అవర్(Zero Hour)లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇదే సభలో ఈనెల 10న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్(Otan Account Budget) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కులగణన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నేడు నీటి పారుదల రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాలు : ఎనిమిది రోజులు జరిగిన శాసనసభ 45 గంటల 32 నిమిషాల పాటు సాగిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridar Babu) తెలిపారు. మొత్తం 59 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారన్నారు. జీరో అవర్లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు 8.43 గంటల పాటు మాట్లాడారని, బీఆర్ఎస్ సభ్యులు 8.41 గంటల పాటు మాట్లాడారన్నారు. మూడు బిల్లులను సభలో ఆమోదించుకున్నామన్నారు.
Telangana Assembly Sessions 2024 Conclude :చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్లు కులగణన తీర్మానాన్ని ఆమోదించుకున్నామని, బలహీన వర్గాలకు అన్ని విధాల న్యాయం చేసేందుకు కులగణన చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశం ప్రధాన ప్రతిపక్షానికి లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులపై మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, జ్యుడీషియరీ విచారణ తర్వాత ఎవరి పాత్ర ఏమిటో తేల్చాలన్నారు. ఇలా విచారణ చేపట్టి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం