Telangana Art Gallery Photo Exhibition Conducted in Hyderabad :హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ ఫొటోగ్రాఫర్ సొసైటీ ఆధ్వర్యంలో 'గ్యాలరియా - 2025' పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ప్రకృతి, వన్యప్రాణులు, ఆహారం, ప్రయాణం వంటి అంశాలను ప్రతిబింబించే విధంగా 40 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 144 ఫొటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు.
ఈ సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి మాట్లాడుతూ ఫొటో ఎగ్జిబిషన్‌ను నగరవాసులు సందర్శించి ఫొటోగ్రాఫర్స్ అద్భుతమైన చిత్రాలను తిలకించాలన్నారు. అనంతరం తెలంగాణ ఫొటో ఎగ్జిబిషన్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో నామినెటెడ్ అవార్డులు అందుకున్న చిత్రాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. యువతకు ఫొటోగ్రఫీపై ఆసక్తి కలిగించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందన్నారు.
"తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా మంచి ఫొటోలు ఉన్నాయి. అందరూ వచ్చి తప్పక చూడాలి. అలాగే తెలంగాణ ఫొటోగ్రాఫర్స్ దించినవే కాకుండా విదేశాల్లో ఉండే వారివి కూడా ఇక్కడ ప్రదర్శించారు." కె.లక్ష్మి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్