Teacher Beats Students in Khammam District : విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారి పట్ల మూర్ఖంగా ప్రవర్తించాడు. కేవలం పరీక్షలో తక్కువగా మార్కులు వచ్చాయంటూ వారిని చితకబాదాడు. ప్లీజ్ సార్ వద్దు సార్ మమ్మల్ని వదిలేయండని ఆ పిల్లలు ఎంత బతిమాలినా వినిపించుకోకుండా డస్టర్‌తో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వారి వీపులు ఎర్రగా కమిలిపోయి వాతలు ఏర్పడ్డాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Gurukulam Teacher Crushed Students : మార్కులు తక్కువగా వచ్చాయంటూ పదో తరగతి విద్యార్థులను తెలుగు ఉపాధ్యాయుడు వీపుపై వాతలు తేలేలా కొట్టిన ఘటన కలకలం రేపింది. తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 62 మంది పదో తరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు ఇటీవల గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటూ దాదాపు 25 మంది విద్యార్థులను మంగళవారం రాత్రి బ్లాక్‌బోర్డు తుడిచే డస్టర్‌తో లక్ష్మణ్‌రావు విచక్షణారహితంగా కొట్టాడు(Teacher Beats Students). దీంతో వారి వీపులు ఎర్రగా కమిలిపోయి వాతలు వచ్చాయి. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన పిల్లల తల్లిదండ్రులు చేరుకుని ఉపాధ్యాయుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
Drunken Teacher Beat Students: మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు