TDP Leaders Reacted on Defeat of YCP Party in Assembly Elections :రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం చెందడంతో పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ప్రజలు జగన్‌మీద వ్యతిరేకతతో ఇచ్చింది సైలెంట్ ఓటింగ్ కాదని, నిశబ్ద విప్లవమని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎన్నికలకు ముందు భయపడ్డా ఆ తర్వాత భయపడకుండా ధైర్యంగా ఓటు వేసి జగన్ కు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
మోత మోగించిన శ్రేణులు- కూటమి ఘన విజయంతో ఊరువాడా మిన్నంటిన సంబరాలు
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైఎస్సార్సీపీను ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పారని తెలుగుదేశం నేత కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అమదాలవలసలో తనను గెలిపించినందు ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళంలోని ఆయన ఇంటివద్దకు తెలుగుదేశం కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చి అభినందనలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తామంతా కృషి చేస్తామన్నారు.
వైసీపీ నేతలు ఇప్పటినుంచి అరాచకాలు, దారుణాలు ఆపాలని లేదంటే కఠిన చర్యలుంటాయని తెలుగుదేశం నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మూడోసారి కూడా తనను గెలిపించినందకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
'ప్రజల తీర్పు నిశ్శబ్ద విప్లవం'- వైఎస్సార్సీపీ ఘోర పరాజయంపై టీడీపీ స్పందన (ETV Bharat) మోత మోగించిన శ్రేణులు- కూటమి ఘన విజయంతో ఊరువాడా మిన్నంటిన సంబరాలు
జనసేన తరపున గెలిచిన వారంతా మరింత బాధ్యతగా పనిచేయాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జనసేనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు ఎవరినైనా ఆదరిస్తారని, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి రాచ మర్యాదలు చేసినా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకు కూటమి ప్రభుత్వంలో తగిన మర్యాద చేస్తామని తెలుగుదేశం నేత పట్టాభి తెలిపారు. జాషువా తనపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ సేవలకు బహుమతిగా విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో విలాసవంతమైన అతిథి గృహంలో ఉన్నారని ఆరోపించారు. ఎస్పీని కలసి పుషగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కారం చేయాలనుకుంటే అందుబాటులో లేరని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజల తనని మోసం చేశారని జగన్ మాట్లాడటం ఆయన పెత్తందారితనానని నిదర్శనమని తెలుగుదేశం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తన చేతకానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని మండిపడ్డారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన తనకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని జగన్ తెలుసుకోవాలని నిమ్మల రామానాయుడు హితవు పలికారు.
విధ్వంసం- విద్వేషం! ఇవే వైఎస్సార్సీపీ ఓటమికి ప్రధాన కారణాలు - Reasons for YSRCP Defeat in AP