TDP leaders complained to EC: వైసీపీ నేతలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో జరిగిన వివిధ అవకతవకల పై సీఈఓ కు ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, వారి టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నీ ఇష్టానుసారం అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలు బరితెగించి ప్రవర్తించకూడదన్నారు. పోలీసులు కూడా బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సత్తెనపల్లి లో మహిళలను అత్యంత గౌరవంగా చూసే మంత్రి అంబటి రాంబాబు, టీ కప్ లపై రాంబాబు, ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్ ఫోటోలు ముద్రించి, సత్తెనపల్లి లోని అన్ని టీ స్టాల్స్ కి ఇచ్చి, అందులోనే టీ పోసి అమ్మాలని చెబుతున్నారని సీఈఓ కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మహానాయకుల ఫొటోలకే ముసుగు వేస్తే మీ ఫోటోలు వేసుకుంటారా అని నిలదీశారు. టీడీపీ సానుభూతిడైన ఒక టీ షాప్ వ్యక్తి టీ కప్పులు తీసుకొని అంటే, మా పోలీసులను పంపిస్తానని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతిపరుల గుండెలో నిద్రపోయే అవినీతి నిరోధక శాఖ నిన్న ఒక్క రోజే వివిధ ఎసీబీ కేసులో ముద్దాయిలుగా ఉన్న 74 మందినీ నిరపరాధులని, నిర్దోషులని ముఖ్యమంత్రి సంతకం చేసి సమాజంలోకి వదిలేశారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశామన్నారు. 43 వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని సీబీఐ చెప్పిన నీతిపరుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,74 మంది అధికారులు నీతిపరులని విడుదల చేశారని ఎద్దేవా చేశారు. కొన్ని వీడియోలు ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, వాటిని అరికట్టాలని చెప్పామన్నారు.