ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ కేసులో బోండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారు - ఈసీకి కనకమేడల లేఖ - TDP leader Kanakamedala Ravindra - TDP LEADER KANAKAMEDALA RAVINDRA

TDP leader Kanakamedala Ravindra: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. సీఎం జగన్​పై రాయి దాడి కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో తెలుగుదేశం నేత బోండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల లేఖలో విజ్ఞప్తి చేశారు.

TDP leader Kanakamedala Ravindra
TDP leader Kanakamedala Ravindra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 4:35 PM IST

TDP leader Kanakamedala Ravindra:కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేందుకు యత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరును ఆయన ఖండించారు. బొండా ఉమా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎంపై రాయి దాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కనకమేడల విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ వేధింపులు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసులు ఇంకా అధికార పార్టీ నీడలోనే పని చేస్తున్నారని మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. పోలీసులను అస్త్రంగా చేసుకొని ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి వైసీపీ అభ్యర్ధులకు మేలు జరిగాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలి: అసలు హత్యాయత్నమే జరగని కేసులో సెక్షన్ 307 ఐపీసీ నమోదు చేసి బెయిల్ కూడా రాని విధంగా విజయవాడ పోలీసు కమిషనర్ ముందస్తు పన్నాగం పన్నారని కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ వద్ద నుంచి బలవంతంగా వాగ్మూలం తీసుకొని బోండా ఉమాను (Bonda Uma) అరెస్ట్ చేయాలని చూస్తున్నారన ద్వజమెత్తారు. బోండా ఉమాపై గెలవలేనని తెలిసి పోలీసులతో వెల్లంపల్లి ఆడుతున్న డ్రామా ఇదంతా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని కనకమేడల సూచించారు. సీఎంపై రాయి దాడి (Stone attack on CM) ఘటనపై ఎన్నికల పరిశీలకుల నుంచి స్వతంత్ర నివేదికలు ఎన్నికల కమిషన్ పొందాలని కోరారు. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక ఈసీ బృందం రాష్ట్రానికి రావాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల లేఖలో విజ్ఞప్తి చేశారు.
జగన్‌పై పోటీ చేస్తున్న బీటెక్‌ రవికి ప్రాణహాని - ఈసీకి కనకమేడల లేఖ - Kanakamedala Ravindra letter to ECI

చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి ఆయన ఒక బ్రాండ్ అంటూ కితాబిచ్చారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా దిల్లీలో కనకమేడల కేక్ కోసి వేడుకలు చేశారు. జగన్‌ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారని కనకమేడల మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ అల్లకల్లోలమైందని విమర్శించారు.

LIVE ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా రాజకీయాలు - టీడీపీ నేత దేవినేని ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - CM Jagan attack Live

ABOUT THE AUTHOR

...view details