TDP Acchennayudu Fires on CP :ఎన్డీఏ కూటమి అభ్యర్దిగా నామినేషన్ వేసిన బొండ ఉమను జగన్ కావాలనే వేధిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీపీ (CP) తీరుపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిని వైఎస్సార్సపీ వేధించటంపై హైకోర్టు ఛీప్ జస్టిస్, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. వేధింపులు ఆపకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. జగన్ చెప్పినట్టు ఆడి మీ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతామని తెలిపారు. ఈ డ్రామాకు కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Kollu Ravindra on Cm Stone Attack Issue in Vijayawada : సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిలో అమాయకులను ఇరికించాలని చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవడానికే సీఎం జగన్ ఫ్లాన్ ప్రకారంగానే రాళ్ల దాడి చేయించుకున్నాడని విమర్శించారు. ఈ కేసులో ఏ మాత్రం సంబంధం లేని వడ్డెర యువకుడు సతీష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి A2గా పేర్కొన్న దుర్గారావుని కనిపించకుండా చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమాని ఇరుకున పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.