ETV Bharat / offbeat

క్రేజీ​ "కొబ్బరి బొబ్బట్లు" - ఈ టిప్స్​తో చేశారంటే ఇంకొకటి కావాలంటారు! - KOBBARI BOBBATLU IN TELUGU

సూపర్​ టేస్టీ కొబ్బరి బొబ్బట్లు - సింపుల్​గా ఇలా చేసేయండి!

How to Make Kobbari Bobbatlu
How to Make Kobbari Bobbatlu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 2:54 PM IST

How to Make Kobbari Bobbatlu : మనలో ఎక్కువ మందికి స్వీట్​ రెసిపీస్​ అంటే చాలా ఇష్టం. అందులోనూ బొబ్బట్లు ఇంట్లో చేశారంటే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. సాధారణంగా ఇంట్లో పూజలు, ఏదైనా వ్రతాలు చేసుకుంటే తప్పకుండా బొబ్బట్లు చేస్తారు. నేతి బొబ్బట్లు, నువ్వుల బొబ్బట్లు ఇలా రకరకాల బొబ్బట్లు చేస్తారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి ఆంధ్రా స్టైల్​ కొబ్బరి బొబ్బట్లు చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో మెత్తగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఈ కొబ్బరి బొబ్బట్లను పిల్లలూ, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చికొబ్బరి పొడి -కప్పు
  • యాలకుల పొడి - టీస్పూన్
  • బెల్లం తురుము - కప్పు
  • మైదా పిండి - ఒక కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • పసుపు - చిటికెడు
  • నెయ్యి - సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో మైదాపిండి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకోండి. ఆపై కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • తర్వాత వేడివేడి నెయ్యి ఒక రెండు టేబుల్​స్పూన్లు పోసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి.
  • తర్వాత పిండి ముద్దపై గిన్నె పెట్టి ఓ పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక పాన్ పెట్టుకొని బెల్లం తురుము, కొన్ని నీళ్లు పోసి కరిగించండి.
  • బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి పొడి వేసి కలపండి. ఒక రెండు నిమిషాల తర్వాత యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి మిక్స్​ చేయండి. (మీరు పచ్చికొబ్బరి పొడికి బదులుగా ఎండుకొబ్బరి పొడి కూడా వాడుకోవచ్చు.)
  • ఈ మిశ్రమం చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
  • తర్వాత మైదా పిండిని మరోసారి కలిపి నిమ్మకాయ సైజంత ముద్దలు చేసుకోవాలి.
  • ఒక ముద్దను చపాతీ పిండిలాగా చేసుకుని బెల్లం కొబ్బరి మిశ్రమం టేబుల్​స్పూన్​ స్టఫ్​ చేసుకోవాలి. ఆపై చివర్లు మూసేయాలి.
  • తర్వాత పూరీ మెషీన్​పై పెట్టి ప్రెస్​ చేయాలి. ఇలా చేస్తే ఈజీగా బొబ్బట్లు తయారవుతాయి.
  • ఆపై స్టవ్​పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేయండి. ఇప్పుడు బొబ్బట్టు వేసి కాల్చుకోండి.
  • రెండు వైపులా కొద్దిగా నెయ్యి వేసి బొబ్బట్లు రంగు మారే వరకు కాల్చుకోండి.
  • అంతే మిగిలిన పిండితో ఇలా సింపుల్​గా బొబ్బట్లు చేసుకుంటే సరి.
  • ఎంతో రుచికరమైన బొబ్బట్లు మీ ముందుంటాయి.
  • ఈ సారి బొబ్బట్లు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఓ సారి ఇలా ట్రై చేయండి.

వాడి వాడి టీ జాలి నల్లగా మారిందా? - ఈ టిప్స్​ పాటిస్తే కొత్తదానిలా మెరిసిపోద్ది!

రుచికరమైన హెల్తీ సొరకాయ దోశ - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.