Swachadanamm Pachadanam Program in Hyderabad :హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని మేయర్ విజయలక్ష్మీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల పాటు నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమం, వనమహోత్సవం ప్రాధాన్యతను వివరించారు. నగరంలోని పార్కులు ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా మైదానాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు బయట కూడా స్వచ్ఛంగా ఉండేలా బాధ్యత వహించాలని మేయర్ విజయలక్ష్మీ కోరారు. బయట చెత్తవేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రజలకు అధికారులు తెలపాలని సూచించారు. జీవీపీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
"మీరు తడి చెత్త పొడి చెత్త కలిపి వేస్తున్నారు. దాన్ని సేకరించేవారు అది సెపరేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దానికి రూ.100 ఇవ్వాలా అంటున్నారు. ఇప్పుడు వంద రూపాయలు ఇవ్వని స్థానంలో ఎవరూ లేరు. రోడ్డు మీద చెత్త పాడేస్తున్నారు. దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ, మలేరియా లాంటి జబ్బులు వస్తున్నాయి. అలా సిటీలో చాలా కేసులు వస్తున్నాయి." - విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం - నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛదనం - పచ్చదనం - CLEANLINESS DRIVE IN TELANGANA
కొన్ని రోజులు పిల్లలను ఒంటరిగా పంపొద్దు :ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తామని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యల గురించి విద్యార్థులకు తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని ఆమ్రపాలి సూచించారు. మురుగు నీటి నిల్వ వల్ల వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు వివరించారు. కిరణా సరుకుల కోసం చిన్న పిల్లలను తల్లిదండ్రులు దుకాణాలకు పంపించవద్దన్నారు. రాబోయే రోజుల్లో కుక్కల స్టెరిలైజ్ చేసేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కమిషనర్ వివరించారు.
"హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య ఎక్కువ ఉందని మాకు తెలుసు. దాన్ని ఎలా పరిష్కరించాలన్న అంశంపై మేము ఆలోచిస్తున్నాం. స్టెరిలైజేషన్ ప్రాసెస్‌పై ఫోకస్ చేశాం. స్టెరిలైజేషన్ కాని కుక్కలను గుర్తించడానికి మేము యాప్ రూపొందిస్తున్నాం. కొన్ని రోజుల్లో అది అందుబాటులోకి వస్తుంది. కొన్ని రోజులు పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపకండి." - అమ్రపాలి, జీహెచ్ఎంసీ కమిషనర్
మహానగరంలో మూత్రశాలలు కరవు - మరుగుదొడ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ - Lack of Public Toilets in GHMC
ఇక చినుకు పడితే జంకనవసరం లేదు - వరదనీరు ఇంకేలా జీహెచ్ఎంసీ సూపర్ ప్లాన్ - RAIN WATER HARVESTING IN HYDERABAD