Justice Narasimha Reddy Dropped out From Electricity Commission: తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తప్పుకున్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన లేఖ రాశారు. భోజన విరామ సమయంలో న్యాయవాది ద్వారా, కోర్టుకు తన లేఖ పంపారు.
లేఖను న్యాయవాదులు, సుప్రీంకోర్టుకు అందించారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించి ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కమిషన్ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వచ్చే సోమవారంలోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుధీర్ఘవాదనలు జరిగాయి.
కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్ విచారణ : రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్ విచారణ జరుపుతున్నారని కేసీఆర్ తరఫు లాయర్ వాదనలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీజేఐ ధర్మాసనానికి చెప్పారు. ఎన్నికలకు ముందే ప్రస్తుత సీఎం ఆర్టీఐ ద్వారా అనేక సమాచారాలు సేకరించి పెట్టుకున్నారని తెలిపారు. వాటి ఆధారంగా ముందస్తు ఆలోచనతోనే కక్షసాధింపు ధోరణితో ఇప్పుడు కమిషన్ వేశారన్నారు.
CJI Bench Objected to Justice Narasimha Press Meet :విచారణ జరుపుతున్న కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టారని, కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రెస్‌మీట్‌పై సీజేఐ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్‌లో, అభిప్రాయాలు వ్యక్తపర్చడం సరికాదని పేర్కొంది. విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది.