SC on Jagan Illegal Assets Case : జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు - సుప్రీంకోర్టులో కీలక పరిణామం
జగన్ అక్రమాస్తుల కేసు - సీజేఐ ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి పిటిషన్ విచారణ మార్పు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2024, 11:22 AM IST
|Updated : Nov 12, 2024, 12:37 PM IST
ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ఏపీకి చెందిందని జగన్ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ బెంచ్‌కు నివేదించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని బెంచ్‌కు విచారణను బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలిచ్చారు. ఈ పిటిషన్లను డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.